'ఆ హీరో నవ్వంటే చాలా ఇష్టం' అంటున్న డాషింగ్ డైరెక్టర్

Update: 2020-04-21 07:30 GMT
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సారి పని చేసిన దర్శకులు మళ్లీ మళ్లీ పని చేయాలనుకుంటారు. ఆయన తో అలాంటి బంధం ఏర్పడుతుంది. హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా మళ్ళీ సినిమా చేయడానికి బాలయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. పూరీ కూడా బాలయ్యతో మళ్లీ సినిమా చేయాలని ఉందంటున్నాడు. వీరి కాంబినేషన్‌ లో వచ్చిన పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ బాలయ్యకు పూరీ - పూరీకి బాలయ్య నచ్చేశారట. ఇప్పటి వరకు తన కెరీర్‌ లో ఇలాంటి స్టైలిష్ సినిమా ఎవరూ చేయలేదని అప్పట్లో దర్శకుడు పూరీ గురించి బాలయ్య చెప్పాడు.

పూరీతో మరో సినిమా చేయడానికి సిద్ధమే అని బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరీ కూడా ఇదే ఆ ప్రయత్నమే చేస్తున్నాడు. బద్రి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ నటించిన పైసా వసూల్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు పూరీ. పైసావసూల్ సినిమా పూరికి కూడా ప్రత్యేకమేనట. తనకు బాలయ్య నవ్వంటే అంటే చాలా ఇష్టమని.. బాలయ్య ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడని చెప్పాడు. ఆయన నవ్వు చూస్తుంటే తెలియని ఎనర్జీ వస్తుందని చెప్తున్నాడు పూరీ. ఆయనతో సరదాగా సాగిపోయే పాత్ర చేయించాలనుకుని పైసా వసూల్ సినిమాను తీశానని చెప్పాడు పూరీ.

ఇక పైసావసూల్ సినిమాలో హీరో కారెక్టర్ పేరు తేడా సింగ్ అనే పేరు పెడితే కూడా బాలకృష్ణ ఏమీ అనలేదని గుర్తు చేసుకున్నాడు. బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా ఎనర్జీగా ఉంటాడని.. ఆయనతో మరోసారి పని చేయాలని ఉందని చెప్పాడు పూరీ. తనతో సినిమా చేయొద్దని చాలా మంది చెప్పినప్పటికీ బాలయ్య పైసా వసూల్ సినిమాకు ఓకే చెప్పారని.. అప్పుడే ఆయనేంటో తెలిసిందని చెప్పుకొచ్చాడు. పైసా వసూల్ సినిమా కథను ఆయనకు 10 నిమిషాలే చెప్పినా కూడా తనపై నమ్మకంతో వెంటనే సినిమా చేద్దామని చెప్పినట్లు చెప్పాడట. ఆయన ముక్కుసూటి మనిషని.. ప్రేమ - కోపం రెండూ వెంటనే చూపిస్తాడని తెలిపాడు డాషింగ్ పూరీ.
Tags:    

Similar News