• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య డైలాగులకు.. సిడి...

బాలయ్య డైలాగులకు.. సిడి సరిపోదు

By - Tupaki Desk
Update: 2017-08-17 08:25 GMT
పూరీ జగన్నాధ్ తీయబోతున్న సినిమా పైసా వసూల్లో హీరో నందమూరి బాలకృష్ణ అనే వార్త విన్నప్పటి నుండి ఫిల్మ్ నగర్ ఎంత షాక్ అయ్యిందో తెలియదు కానీ బాలయ్య అభిమానులు మాత్రం పండుగ చేసుకున్నారు. పూరీ జగన్నాధ్  తన సినిమాలో హీరోని చూపించే స్టైల్ వేరేగా ఉంటుంది. వీరం పొగరు ఏ మాత్రం తగ్గకుండా రెండు వైపులా పదున్న కత్తిలా చూపిస్తాడు. మరి అలాంటి డైరెక్టర్ తో బాలయ్య మొదటిసారి పని చేస్తే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో పైసా వసూల్ సినిమాకు కూడా అంతే క్రేజ్ ఏర్పడింది.

పైసా వసూల్ పోస్టర్ విడుదల దగ్గరనుండి నిన్న విడుదలైన ప్రోమో సాంగ్ వరకు చూస్తే అందరికీ ఒక్క దాన్ని పైనే దృష్టి ఉంది బాలయ్య లుక్ పైన బాలయ్య  డైలాగ్లు పైన. ఇప్పటికీ వరకు చూసిన బాలకృష్ణ వేరు ఈ సినిమాలో బాలకృష్ణ వేరుని పైసా వసూల్ స్టంపర్ మేకింగ్ వీడియొ చూస్తేనే అర్ధంవుతుంది. అయితే ఈ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో పూరీ బాలయ్య అభిమానులుకు ఒక మాట ఇచ్చాడు. పూరీ బాలయ్య గురించి మాట్లాడుతూ " నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది. బాలయ్య తో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోరిక నెరవేర్చిన బాలయ్యకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా అభిమానులుకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మీరు బాలయ్య నుండి ఏమి కోరుకుంటున్నారో అవి అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దానికి నేను హామీ. జై బాలయ్య" అని చెప్పాడు.

ఈ సినిమాలో బాలయ్య  డైలాగ్లు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నకు పూరీ జగన్నాధ్ తన స్టైల్ లో జవాబు ఇచ్చాడు. ''ఈ సినిమాలో బాలయ్య డైలాగ్లుకి ఒక ఆడియో సి‌డి సరిపోదు మీరే చూస్తారు కదా'' అని చెబుతున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదలవుతుంది. ఈ సినిమా  బాలకృష్ణ చేస్తున్న 101 వ సినిమా కావడం విశేషం. అనూప్ రుబెన్స్ సంగీతం ఇస్తున్న ఈ సినిమాలో శ్రీయ శరణ్, ముస్కాన్ సేథి హీరోయిన్స్ గా చేస్తున్నారు. కైరా దత్ తన అందాలను దారబోస్తోంది.
Tags:    
  • Puri Jagannadh 
  • Balayya Dialogues 
  • Paisa Vasool 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS