పూరి అంద‌రికీ అంటిస్తాడేమో!

Update: 2020-05-19 04:00 GMT
నాకు మహమ్మారి ..! అంటూ ధ‌డ పుట్టించాడు గురువు రామ్ గోపాల్ వ‌ర్మ‌. `క‌నిపించ‌ని పురుగు` అంటూ వికృత‌మైన ఎక్స్ ప్రెష‌న్ తో పాట పాడి క‌రోనానే భ‌య‌పెట్టారు. అయితే ఆయ‌న శిష్యుడు పూరి జ‌గ‌న్నాథ్ కి అలాంటిదేదైనా అంటుకుందా? అంటే అదేమీ లేదు కానీ.. ఆయ‌నలో ఇప్పుడు వేరొక క్రేజీ ఫీవ‌ర్ రాజుకుంద‌ని తెలుస్తోంది. పూరీలో వెబ్ సిరీస్ ఫీవ‌ర్ రాజుకుంద‌ట‌. ఇక‌పై వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీని న‌డిపించాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నార‌ట‌.

అయితే పూరి ఇంత సీరియ‌స్ గా ఆ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే.. ప్ర‌స్తుత `క‌రోనా లాక్ డౌన్` స‌న్నివేశం ఆయ‌న ఆలోచ‌న‌ను మార్చింద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే విజయ్ దేవరకొండతో ఫైట‌ర్ చిత్రీక‌రణ పెండింగ్ లో ప‌డిపోయింది. ఈ సినిమాని మెజారిటీ పార్ట్ ముంబైలో తెర‌కెక్కించాల్సి ఉండ‌గా.. అక్క‌డ‌ ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. కానీ ముంబై అల్లాడుతోంది. మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. లాక్ డౌన్ ప్రకటించిన అనంత‌ర‌ స‌న్నివేశాలు మైండ్ ని బ్లాక్ చేసేశాయి. ఇప్ప‌ట్లో ముంబైలో అడుగుపెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే ఫైట‌ర్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

అదంతా అటుంచితే.. ప్ర‌స్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తోంది. యూత్ ని యంగేజ్ చేసే విష‌యం ఉన్న కంటెంట్ తో వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తే `ఫ్యామిలీ మ్యాన్` త‌ర‌హాలో స‌క్సెస‌య్యే ఛాన్సుంద‌ని పూరి భావిస్తున్నార‌ట‌. పైగా మునుముందు అంతా వెబ్ సిరీస్ ల ట్రెండ్ న‌డ‌వ‌నుంద‌ని గ్ర‌హించాడు. దీంతో  రాబోయే రోజుల్లో క్రేజీ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ వ్యవధిలో స్క్రిప్టింగ్ లో బిజీగా ఉన్నాడట‌.

పూరి కాస్త పెద్ద రేంజులోనే ఓ రెండు ప్రాజెక్టులను ప్రారంభించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వెబ్ సిరీస్ తో స‌క్సెస్ రుచి చూస్తే ఇక అత‌డి నుంచి వ‌రుస‌గా క్రేజీ వెబ్ సిరీస్ లు వ‌చ్చే వీలుంటుంది. ఇక పూరీకి అంటుకున్న‌ది ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు అంటుకోవ‌డం ఖాయ‌మే. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్లు ఆ దిశ‌గా ఆలోచిస్తున్నార‌న్న లీకులు అందుతున్నాయి. పూరి లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు అటువైపు మొగ్గు చూపితే ఇత‌రుల‌కు అది ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్ని పూర్తి చేయాలి.. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ లు తీయాలి. అదీ సంగ‌తి.
Tags:    

Similar News