• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇడియట్‌ 2 చేయాల్సింది ఆ...

ఇడియట్‌ 2 చేయాల్సింది ఆ చెత్త సినిమా చేశా

By - Tupaki Desk
Update: 2021-07-03 02:54 GMT
టాలీవుడ్‌ లో ఈతరం దర్శకుల్లో అత్యంత స్పీడ్‌ గా అత్యధిక సినిమా లు తీసిన దర్శకుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో వరుసగా ఆమద్య బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇండస్ట్రీ హిట్స్ తెరకెక్కించిన ఆయనే అత్యంత దారుణమైన డిజాస్టర్స్ ను కూడా తెరకెక్కించాడు. డిజాస్టర్‌ సినిమాలు కూడా తనకు కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి కాని తన సినిమాల్లో దేవుడు చేసిన మనుషులు సినిమా మాత్రమే నచ్చదు అంటూ పూరి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో ఇష్టపడి చేశాను. కాని దేవుడు చేసిన మనుషులు మాత్రమే తనకు సంతృప్తిని ఇవ్వలేదు అంటూ అసంతృప్తిని కలిగించింది అంటూ వ్యాఖ్యలు చేశాడు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ కు ప్లాప్ గా నిలవడమే కాకుండా ఆ సినిమా విమర్శలు కూడా ఎదుర్కొంది. ఒక కథను రెండు విధాలుగా చూపించే ప్రయత్నం చేసిన పూరి విఫలం అయ్యారు. ఒకే కథ రెండు రకాలుగా అనేది కొత్త కాన్సెప్ట్‌. కాని దాన్ని పూరి ఇంకాస్త డెప్త్‌ గా వర్కౌట్‌ చేయాల్సిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో పూరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడు.

రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. ఇడియట్.. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.. నేనింతే సినిమాలను తెరకెక్కించిన పూరి మొదటి మూడు సినిమాలతో మంచి విజయాలను దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల వల్లే రవితేజ హీరోగా స్టార్‌ అయ్యాడు అనడంలో కూడా సందేహం లేదు. ఇక పూరి.. రవితేజల కాంబోలో వచ్చిన నాల్గవ సినిమా నేనింతే కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేసింది అనడంలో సందేహం లేదు. అందుకే రవితేజతో అయిదవ సినిమా చేసి సక్సెస్ దక్కించుకోవాలని డేట్లు తీసుకున్నాడు.

ఆ సమయంలో ఇడియట్‌ 2 కథ ను సిద్దం చేయాలనుకున్నాడు. రవితేజ డేట్లు ఇచ్చే సమయానికి ఇడియట్ 2 కథ సిద్దం అవ్వక పోవడంతో అప్పటికే తన వద్ద ఉన్న దేవుడు చేసిన మనుషులు సినిమా కథను రవితేజతో చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ కథ పై పూరి పూర్తిగా వర్క్ చేయలేదేమో అది కాస్త ప్లాప్‌ అయ్యింది. దేవుడు చేసిన మనుషులు సినిమా ను చేసినందుకు తాను ఇప్పటికి కూడా బాధ పడుతాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు. నేను చేసిన ఏకైక చెత్త సినిమా అదే అంటూ పూరి ఓపెన్‌ గా చెప్పేశాడు. అంతే కాకుండా పూరి జగన్నాద్‌ ఆ పాయింట్‌ ను తాను సరిగ్గా ప్రజెంట్‌ చేయలేక పోయాను అని కూడా అన్నాడు.

ఇక మిగిలిన తాను చేసిన సినిమాలన్నీ కూడా నాకు నచ్చేవే. ప్రతి ఒక్క సినిమా నాకు సంతృప్తిని ఇచ్చినవే అన్నాడు. పూరి జగన్నాద్‌ కాస్త ప్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్‌ తో సక్సెస్ దక్కింది. ఆ సక్సెస్‌ ఇచ్చిన బూస్ట్‌ తో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తో లైగర్ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా రౌడీ స్టార్‌ ను పూరి విభిన్నంగా చూపిస్తున్నాడో చూడాలి. కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న లైగర్ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని పూరి భావిస్తున్నాడు. విడుదల పై తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    
  • Puri Jaganadh 
  • Puri Jaganadh movies 
  • Puri Jaganadh hits and flops 
  • Puri Jaganadh latest movies 
  • devudu chesina manushulu 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS