• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తీవ్ర విషాదం: కన్నడ పవర్...

తీవ్ర విషాదం: కన్నడ పవర్ స్టార్ మృతి

By - Tupaki Desk
Update: 2021-10-29 09:30 GMT
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌ కుమార్‌ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంట్లోని జిమ్‌ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్‌ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. గుండెపోటు కారణంగానే రాజ్‌ కుమార్‌ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

పునీత్‌ రాజ్ కుమార్ వయసు 46. అగ్ర హీరో చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో కన్నుమూయడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. షాక్ కు గురైన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కన్నడ పవర్ స్టార్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి - మహేష్ బాబు - రామ్ గోపాల్ వర్మ - మంచు విష్ణు - మంచు లక్ష్మి - నివేదా థామస్ - సోనూ సూద్ వంటి వారు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై. యష్ ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ ఇంటికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. సినిమా థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


Tags:    
  • Kannada star 
  • Puneet Rajkumar 
  • heart attack 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS