• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యాన్స్ ఆత్మహత్యలపై...

ఫ్యాన్స్ ఆత్మహత్యలపై పునీత్‌ భార్య స్పందన

By - Tupaki Desk
Update: 2021-11-06 08:31 GMT
కన్నడ సూపర్ స్టార్‌ పునీత్‌ రాజ్ కుమార్‌ హఠత్మరణం ను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్‌ మృతి చెంది వారం దాటుతున్నా కూడా ఇంకా అభిమానులు శోఖం నుండి బయటకు రాలేక పోతున్నారు. కొందరు పునీత్‌ రాజ్ కుమార్ గురించి ఆలోచిస్తూ డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయి చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారట. ఇప్పటి వరకు కన్నడ రాష్ట్రంలో పునీత్‌ రాజ్‌ కుమార్ మృతిని జీర్ణించుకోలేక 12 మంది మృతి చెందారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మరి కొందరు గుండె పగిలి చనిపోతున్నారు. పునీత్‌ అభిమానుల గుండెలు పలుగుతున్న ఈ సమయంలో కన్నడ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వారు ఆ చావులను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్‌ మృతి నుండి జనాలు బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

పునీత్‌ రాజ్ కుమార్‌ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆయన భార్య శ్రీమతి అశ్విని మాట్లాడారు. మీరు ఈ సమయంలో చూపిస్తున్న అభిమానంకు ఎప్పటికి రుణపడి ఉంటాం. అప్పు మన మద్య లేకున్నా కూడా ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పు ఎప్పుడు కూడా అభిమానులు సంతోషంగా ఉండాలని కోరుకునే వారు. ఆయన లేని విషయంను మేము కూడా జీర్ణించుకోలేక పోతున్నాం. ఆయన మరణం మా కుటుంబంకు పెద్ద లోటు. అలాంటి లోటు మీ కుటుంబంకు ఉండకూడదు. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుని కుటుంబంను ఒంటరి చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆత్మహత్య ఆలోచన పెట్టుకోవద్దని.. దిగులుతో ఉండవద్దని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

పునీత్ రాజ్ కుమార్‌ మృతి తర్వాత చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సాదారణ జనాలు కూడా తమ గుండెకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఆసుపత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటున్నారు. ఈమద్య కాలంలో బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులు చెకప్‌ లకు వచ్చే వారితో కిక్కిరిసి పోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పునీత్‌ రాజ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్‌ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య ఇంకా కొందరు కూడా పునీత్ రాజ్ కుమార్ కు నివాళ్లు అర్పించారు.



Tags:    
  • Kannada star 
  • Puneet Rajkumar 
  • heart attack 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS