• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రతీ 'పుష్ప' పోస్ట‌ర్ పై...

ప్రతీ 'పుష్ప' పోస్ట‌ర్ పై పునీత్ రాజ్ కుమార్ ఫోటో..?

By - Tupaki Desk
Update: 2021-11-22 11:30 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ''పుష్ప''. రెండు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న ఈ మూవీ విడుదల కానుంది. హిందీలో ఈ చిత్రాన్ని గోల్డ్ మైన్స్ సమర్పణలో ఏఏ ఫిలిమ్స్.. తమిళ్ లో లైకా సంస్థ విడుదల చేస్తోంది. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ వారు ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

కర్ణాటకలో 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలానే ప్రమోషన్స్ భాగంగా రిలీజ్ చేసే ప్ర‌తి బ్యాన‌ర్ లో.. పోస్ట‌ర్ లో దివంగత పునీత్ రాజ్ కుమార్ ఫొటో వేయాలని ప్లాన్ చేస్తున్నారట. కన్నడ పవర్ స్టార్ పునీత్ ఈ మధ్య గుండెపోటుతో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కు పునీత్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు బన్నీ నటిస్తున్న సినిమా పోస్టర్స్ లో పునీత్ గౌరవార్థం ఆయన ఫోటోని ముద్రించాలని ఆలోచిస్తున్నారట. ఈ విధంగా స్టార్ హీరోకి ఘనమైన నివాళి అర్పించాలని అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ నటుడు ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, 'పుష్ప: ది రైజ్' సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. ఈ నెల 28నుంచి అల్లు అర్జున్ - సమంత లపై షూట్ చేయనున్న పాటతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’ డబ్బింగ్ ఫార్మాలిటీస్‌ ఫుల్ స్వింగ్‌ లో జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే బన్నీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'పుష్ప' చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ విలన్స్ గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ సినిమాని బీభారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు


Tags:    
  • Kannada star 
  • Puneet Rajkumar 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS