• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యాన్స్ కు పునీత్‌ రాజ్...

ఫ్యాన్స్ కు పునీత్‌ రాజ్ కుమార్‌ భార్య ఎమోషనల్ మెసేజ్

By - Tupaki Desk
Update: 2021-11-18 09:38 GMT
కన్నడ సూపర్ స్టార్‌ పునీత్‌ రాజ్ కుమార్‌ మృతి వార్తను అభిమానులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పు సర్‌ అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక పునీత్ యాదిలో ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఆయన మృతి వార్తతో చాలా మంది గుండెలు పగిలాయి.

ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా యావత్త్‌ సినీ లోకం మరియు ప్రేక్షక లోకం కూడా జీర్ణించుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. అభిమానులు ఇంకా కూడా శోకంలో ఉన్న నేపథ్యంలో పునీత్‌ రాజ్ కుమార్‌ భార్య అశ్వినీ రాజ్ కుమార్ స్పందించారు. ఆమె ఇప్పటికే అభిమానులు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేసింది.

తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భార్య అశ్విని ఇన్ స్టా గ్రామ్‌ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఆమె తన భర్త అప్పు మరణంతో బాధ పడుతున్న అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ ఇచ్చింది. అప్పు మృతి మా కుటుంబంకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా కన్నీరు మిగిల్చింది. అభిమానులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమె కోరింది.

పునీత్ రాజ్ కుమార్‌ చనిపోయిన తర్వాత ఆయన కళ్లు దానం చేసిన విషయాన్ని తెలుసుకున్న ఎంతో మంది అభిమానులు ఇప్పుడు తమ కళ్లను దానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈమద్య కాలంలో వందల కొద్ది రిజిస్ట్రేషన్ లు అవ్వడం అభినందనీయం అంటూ అశ్వినీ పేర్కొన్నారు.

పునీత్ చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి బాధను కలిగించింది. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో ఆయన ఆశయాలను మరియు ఆయన ప్రారంభించిన పనులను తాను కొనసాగించబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు.

అభిమానులు అధైర్యపడవద్దంటూ విజ్ఞప్తి చేసింది. అభిమానులకు అండగా తాను ఉంటాను అన్నట్లుగా హామీ ఇచ్చింది. అశ్విని సోషల్‌ మీడియా ఎంట్రీ ఇవ్వడంను అప్పు అభిమానులు స్వాగతించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 50 వేలకు పెరిగింది. అప్పుపై ఉన్న అభిమానం ను అంతా కూడా అశ్విని పై చూపుతున్నారు. అభిమానుల గురించి ఇంతగా ఆలోచిస్తున్న అశ్వినిని సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
Tags:    
  • Kannada star 
  • Puneet Rajkumar 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS