ఫొటోటాక్‌ః కాస్త ఆలస్యంగా పవన్ బర్త్ డే గిఫ్ట్
ఇండస్ట్రీలో ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్స్ గా అనీల్ భానుల ద్వయంకు మంచి పేరు ఉంది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు పదుల సంఖ్యలో సినిమాలకు వీరు పబ్లిసిటీ డిజైన్ లు చేస్తూ ఉంటారు. ఈమద్య కాలంలో డిజిటల్ పోస్టర్స్ ను కూడా వీరు చేస్తున్నారు. తాజాగా వీరు పవన్ కళ్యాణ్ ను కలిసి బర్త్ డే గిఫ్ట్ ను ఇచ్చారు. ఇప్పుడు పవన్ బర్త్ డే గిప్ట్ ఏంటీ అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే వీరు ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను వీళ్లు పవన్ బర్త్ డే కోసం రెడీ చేయాలనుకున్నారు. కాని అది కాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు పూర్తి అవ్వడంతో పవన్ కు అందజేశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ గ్యాప్ లో వీరిద్దరు కలిసి ఆ డిజైన్ ను పవన్ కు అందించారు. వెన్ వర్డ్స్ మేక్ నాయిస్.. సైలెన్స్ కెన్ టాక్ అనే సూక్తిని ఆ పోస్టర్ లో పెట్టారు. ఇక పవన్ ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా చేతులు వెనక్కు కట్టుకుని స్టైల్ గా నిల్చున్న పోస్టర్ ను అనీల్ భానులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ డిజైన్ ను పవన్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ను మీరు ఒక లుక్కేయండి.