• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ పవర్ చూపించినా.....

టీజర్ పవర్ చూపించినా.. టార్గెట్ రీచ్ కాని ఫ్యాన్స్!

By - Tupaki Desk
Update: 2021-01-17 13:58 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్'. దాదాపు మూడేళ్ల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో పవన్ అభిమానులతోపాటు, ఇతర ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి క్రేజ్ వచ్చింది.

అన్ని అవాంతరాలనూ దాటుకొని సంక్రాంతి పర్వదినం సందర్భంగా రిలీజైంది వకీల్ సాబ్ టీజర్. ఈ టీజర్ మోస్ట్ పవర్ ప్యాక్డ్ విజన్ ను ఎక్స్ ప్రెస్ చేసింది. 'అబ్జక్షన్ యువర్ హానర్' అంటూ మొదలైన ఈ టీజర్ ను మొత్ం పవన్ మాత్రమే ఆక్రమించారు.

కోర్టులో వాదించడమూ తెలుసు.. వాయించడమూ తెలుసు' అంటూ కేవలం రెండే డైలాగులతో ముగించిన ఈ టీజర్ అభిమానులకు గూస్ బమ్స్ చేసింది. ఎప్పుడెప్పుడు మిగిలిన సినిమాను చూసేద్దామా? అనే కోరికను రెట్టింపు చేసింది.

అయితే.. ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ వేశారు. వ్యూస్, లైక్స్ విషయంలో నెవర్ బిఫోర్ రికార్డులు సాధించడానికి ప్రయత్నించారు. 24 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ కొట్టేసి ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ సాధించిన టీజర్ గా వకీల్ సాబ్ ను నిలబెట్టాలని ట్రై చేశారు.

కానీ.. మూడు రోజులు కావస్తున్నా ఆ టార్గెట్ రీచ్ కాకపోవడం గమనార్హం. అయితే.. అలాగని ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ తక్కువేం కాదు. ఒక రీమేక్ సినిమాకు, అందునా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయని వకీల్ సాబ్ మూవీ టీజర్.. టాలీవుడ్ టాప్-2 మోస్ట్ లైక్డ్ టీజర్ గా నిలవడం విశేషం!

పవన్ ఇలా రీమేక్ కాకుండా ఒక స్ట్రయిట్ సినిమాతో వచ్చి ఉంటే డెఫినెట్ గా దాని రేంజ్ మరో స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్‌' చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.
Tags:    
  • PSPK 
  • Vakeel Saab 
  • Tollywood 
  • Pavan Kalyan 
  • Latest News 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS