టిక్ టాక్ వీడియోలపై పోలీసులకు కమెడియన్ ఫిర్యాదు

Update: 2020-04-28 07:50 GMT
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ లో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ ఫృథ్వీ ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో వైసీపీలో కీలక పాత్ర పోషించి గెలిచాక ఏకంగా టీటీడీ ఆధ్వర్యంలోని ‘ఎస్వీబీసీ’ చానెల్ చైర్మన్ గా నియమితులయ్యారు. అయితే అందులో పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో టెలిఫోన్ సంభాషణ లీక్ అయ్యి ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది.

ఇక ఆ ఉదంతం బయటపడినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫృథ్వీ పై బోలెడు ట్రోల్స్ , మీమ్స్  వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్లో ఆయనను అవమానించేలా  పలువురు నెటిజన్లు బోలెడు వీడియోలు వదలుతున్నారు.

తాజాగా టిక్ టాక్ లోనూ ఫృథ్వీపై దారుణమైన వీడియోను విడుదల చేశారు. దీంతో వీటికి మనస్తాపం చెందిన ఫృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.  యూట్యూబ్, టిక్ టాక్ ఖాతాలు ట్రోల్ చేస్తున్నాయని వాటిపై ఫిర్యాదు చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫృథ్వీ కొందరు టాలీవుడ్ ప్రముఖ తారలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కట్ చేసి వీడియోలు రూపొందించి వారిని అవమానించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దీన్ని అరికట్టాలని ఫృథ్వీ ఫిర్యాదులో కోరారు.
Tags:    

Similar News