సెకండ్ ప్రెగ్నెన్సీపై మెగా కోడలు హాట్ కామెంట్స్
రీసెంట్ గా ఓ సందర్భంగా తన సెకండ్ ప్రెగ్నెన్సీపై లావణ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా ఒకటి. రీసెంట్ గా ఓ సందర్భంగా తన సెకండ్ ప్రెగ్నెన్సీపై లావణ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తాజా సినిమా సతీ లీలావతి ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య, తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్ లో తాను ఎన్నో హెల్త్ ఇష్యూస్ ను ఫేస్ చేశానని, అయితే ఇప్పుడవన్నీ సవ్యంగా ఉన్నాయని ఆమె క్లారిటీ ఇచ్చారు లావణ్య.
బిడ్డ పుట్టాక కష్టాలన్నీ మర్చిపొయా
ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, అప్పుడు శారీరకంగా, మానసికంగా చాలానే ఛాలెంజ్ లు వచ్చినప్పటికీ, బిడ్డ పుట్టిన తర్వాత ఆ కష్టాలన్నింటినీ మర్చిపోయానని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని, కంఫర్ట్ గా సెకండ్ ప్రెగ్రెన్సీని కూడా ప్లాన్ చేసుకోవచ్చనిపిస్తుందని లావణ్య తెలిపారు. తల్లి అయ్యాక తనలో ఎన్నో మార్పులు వచ్చినట్టు కూడా లావణ్య పేర్కొన్నారు.
జీవితానికి కొత్త అర్థమొచ్చింది
మాతృత్వమనేది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అని, ప్రతీ రోజూ కొత్తగా ఏదొకటి నేర్చుకుంటున్నానని, కొడుకు పుట్టాక తన లైఫ్ కు కొత్త అర్థమొచ్చిందని లావణ్య చెప్పుకొచ్చారు. అయితే వరుణ్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబీకులను ఒప్పించి, వారి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట, తమ పర్సనల్ లైఫ్ ను ప్రైవేట్ గా ఉంచుకుంటూ వస్తున్నారు. వీరిద్దరికీ వాయువ్ అనే కొడుకు పుట్టగా, కొడుకు గురించి మాట్లాడినప్పుడు లావణ్య ఫేస్ లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక సతీ లీలావతి విషయానికొస్తే ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ పై లావణ్య ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. అటు పర్సనల్ లైఫ్ ను ఆనందిస్తూనే, మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్లో కూడా లావణ్య స్ట్రాంగ్ గా ముందుకు సాగుతూ, అన్ని విషయాల్లోనూ పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్తున్నారు. కాగా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి లావణ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.