బాలయ్య సినిమాలో హాట్ లేడీ!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. వాటన్నింటిని పూర్తి చేసి మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా మరోసారి లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. కంటెంట్ సహా బాలయ్య మాస్ ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయడం నయన్ తోనే సాద్యమవుతుందని మరోసారి తననే నాయికగా ఎంపిక చేసారు. మరి ఈ సినిమాలో సెకెండ్ లీడ్ కి కూడా ఛాన్స్ ఉందా? అంటే అవుననే ప్రచారం తెరపైకి వచ్చింది.
మరో కీలక పాత్రకు బాలీవుడ్ హాట్ లేడీ హ్యూమా ఖురేష్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. దాదాపు ఆమె ఎంపిక ఖాయమనే అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం తేలాల్సి ఉంది. ఈ బ్యూటీ ఇంత వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు. సౌత్ లో మాత్రం మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. 'కాలా', 'వలిమై' లాంటి చిత్రాల్లో మ్యూమా ఖురేష్ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. 'కాలా'లో రజనీకాంత్ ఎక్స్ లవ్ పాత్రలో కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా అమ్మడు నటించలేదు.
తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఓ సినిమాలో నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఆమెను తీసుకోలేదు. తాజాగా బాలయ్య ఆ ఛాన్స్ ఇవ్వడంతో హ్యూమా ఖురేషీ పేరు నెట్టింట చర్చలొకి వచ్చింది. అలాగే పాన్ ఇండియాలో రిలీజ్ కు రెడీ అవుతోన్న 'టాక్సిక్' చిత్రంలోనూ హ్యూమా ఖురేషీ నటిస్తోంది. ఇందులో అమ్మడు ఓ పవర్ పుల్ పాత్రలో కనిపించనుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమా విజయం సాధిస్తే సౌత్ లో ఖురేషీ పేరు మారు మ్రోగిపోవడం ఖాయం. తెలుగు మార్కెట్ పరంగా బాలయ్య సినిమా కూడా అమ్మడికి కీలకమే.
తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతోన్న తరుణంలో ఎంతో మంది బాలీవుడ్ తారలు టాలీవుడ్ చిత్రాల్లో భాగమవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవకాశాలు అంత సులభంగా రావడం లేదు. నార్త్ భామల కంటే సౌత్ భామలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి సమయంలో హ్యూమాకు తెలుగు బిగ్ స్టార్ సినిమాలో అవకాశం రావడం లక్కీ అనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో 'గులాబీ', 'పూజా మేరీ జాన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మినహా హిందీ కొత్త సినిమాలు వేటికి సైన్ చేసింది లేదు.