తండ్రీ-కొడుకులు సైలెన్స్ బ్రేక్ అయ్యేలా!
చియాన్ విక్రమ్ కు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. సినిమాలైతే చేస్తున్నాడు గానీ అతడి ఇమేజ్ కు తగ్గ హిట్లు అయితే పడటం లేదు.;
చియాన్ విక్రమ్ కు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. సినిమాలైతే చేస్తున్నాడు గానీ అతడి ఇమేజ్ కు తగ్గ హిట్లు అయితే పడటం లేదు. హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ అంటూ ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ విక్రమ్ మాత్రం రీజనల్ మార్కెట్ లో తప్ప పాన్ ఇండియాలో సినిమాలు చేయడం లేదు. కానీ 60 ఏళ్ల వయ సు లోనూ చియాన్ లుక్ పరంగా ఎంత మాత్రం రాజీ పడలేదు. దర్శకుల కోరిన లుక్ లో ట్రాన్సపర్మేషన్ తో అదర గొడుతున్నాడు. అలాగే తనయుడు ధృవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రవేశం అయితే చేసాడు ధృవ్ మార్క్ ఇంకా ఎక్కడా పడలేదు. తండ్రీ కొడుకులిద్దరు కలిసి నటించిన `మహాన్` మాత్రం తమిళ్ లో బాగానే ఆడింది. తెలుగు ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడీ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. `మహాన్ 2` టైటిల్ తో ఈ సినిమా చేయాలని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టోరీ పనులు కూడా ప్రారంభించాడు. 2027-28 నాటికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఈ సినిమా కోసం తండ్రీకొడుకులిద్దరు న్యూ మేకోవర్లో కనిపించనున్నారు. ఈప్రాజెక్ట్ పక్కన బెడితే? ఇద్దరు మరో భారీ యాక్షన్ కథలో నటించాలని ఆసక్తిగా ఉన్నారు.
దీనిలో భాగంగా కథలు వింటున్నారు. అయితే అవేవి విక్రమ్ ను సంతృప్తి పరచలేదు. తాను కోరుకున్న విధంగా స్టోరీలు లేకపోవడంతో రిజెక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా నెట్టింట చక్కర్లు కొడు తోంది. తండ్రి విలన్ గా..తనయుడు హీరోగా కూడా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే వెండి తెరపై ఇదో సంచలనం అవుతుంది. విక్రమ్ ఇండియాలోనే ఎంతో పేరున్న నటుడు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు.
మహేష్ హీరోగా నటిస్తోన్న `వారణాసి` చిత్రంలో మహేష్ డాడ్ పాత్రని సైతం రాజమౌళి విక్రమ్ కి ఆఫర్ చేసారు. కానీ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అలాంటి విక్రమ్ తనయుడి కోసం విలన్ గా కూడా మారడానికి రెడీ అవుతున్నాడా? అనేది ఎంతో ఇంట్రెస్టింగ్. ఈ రకమైన స్టోరీలు కూడా ఉంటే వినిపించండని కూడా కొంత మంది రైటర్లను విక్రమ్ అడిగాడుట. చియాన్ ని విలన్ గా చూపించడం అంటే చిన్న విషయంలో కాదు. అతడి స్వాగ్ ఏమాత్రం మిస్ కాకుండా సినిమాలో హీరో పాత్రను హైలైట్ చేయాలి. అందుకు ధీటుగా ప్రతి నాయకుడి పాత్ర ఉండాలి. అలాంటి స్క్రిప్ట్ లు దొరకడం అంత సులభం కాదు.