మెగా కాంపౌండ్ లో శ‌నివారం డైరెక్ట‌ర్!

గాంధీ ట్రాక్ రికార్డు చూసి ఛాన్స్ ఇచ్చాడు. ఇంత వ‌ర‌కూ మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించిన సినిమాల్లో కొన్ని విజ‌యాలు సాధించ‌గా కొన్ని యావ‌రేజ్ గా ఆడాయి.;

Update: 2026-02-22 02:45 GMT

వ‌రుస వైఫ‌ల్యాల‌తో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా స్టోరీల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటున్నాడు. కంగారు ప‌డి క‌మిట్ అవ్వ‌డం లేదు. ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుని అన్ని ర‌కాలుగా క్లిక్ అవుతుద‌నుకుంటేనే ముందుకెళ్లే ఆలోచ‌న‌లో క‌నిపిస్తున్నాడు. `ఎఫ్ 3` త‌ర్వాత న‌టించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ ప్లాప్ లు ఇవ్వ‌డంతోనే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం మేర్ల పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో `కొరియ‌న్ క‌న‌క‌రాజు` అనే చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదొక హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ఈ జాన‌ర్లో ఇంత వ‌ర‌కూ వ‌రుణ్ తేజ్ సినిమా చేయలేదు.

కొత్త‌గా ట్రై చేస్తోన్న చిత్ర‌మిది.

గాంధీ ట్రాక్ రికార్డు చూసి ఛాన్స్ ఇచ్చాడు. ఇంత వ‌ర‌కూ మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించిన సినిమాల్లో కొన్ని విజ‌యాలు సాధించ‌గా కొన్ని యావ‌రేజ్ గా ఆడాయి. ఆ న‌మ్మ‌కంతోనే వ‌రుణ్ తేజ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాపై వ‌రుణ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా మెగా కాంపౌండ్లో మ‌రో హిట్ మేక‌ర్ ఎంట‌ర్ అయిన‌ట్లు వినిపిస్తోంది. అత‌డే వివేక్ ఆత్రేయ‌. ఇటీవ‌లే వివేక్, వ‌రుణ్ కు ఓ స్టోరీ వినిపించాడుట‌. న‌చ్చ‌డంతో వ‌రుణ్ కూడా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు తెలిసింది. ఇదీ ఓ డిఫ‌రెంట్ ల‌వ్ అండ్ కామెడీ చిత్ర‌మ‌ని తెలిసింది.

అయితే ఇదింకా ఫైన‌ల్ అవ్వ‌లేదు. చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉందిట‌. వ‌రుణ్ పాజిటివ్ గా ఉండ‌టంతో పూర్తి స్టోరీ సిద్ద‌మ‌వుతుంద‌ని స‌మాచారం. వివేక్ ఆత్రేయ కూడా మంచి మేక‌ర్. డిఫ‌రెంట్ అటెంప్స్ట్ చేస్తుంటాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన నాలుగు సినిమాలు మంచి ఫ‌లితాలే ఇచ్చాయి. చివ‌రి చిత్రం `స‌రిపోదా శ‌నివారం`. ఈ సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా బాగానే ఆడింది. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. అప్ప‌టి నుంచి వివేక్ ఖాళీగానే ఉంటున్నాడు. హీరోలంతా అప్ప‌టికే క‌మిట్ అయిన చిత్రాల‌తో బిజీగా ఉండ‌టంతో డేట్లు దొర‌క‌లేదు.

కొంత మంది స్టార్స్ ను ట్రై చేసాడు గానీ డేట్లు లేక‌పోవ‌డంతో? వివేక్ కూడా ఖాళీగా ఉండాల్సి వ‌చ్చింది. చివ‌రిగా వ‌రుణ్ తేజ్ పాజిటివ్ గా స్పందించ‌డంతో మూవ్ అవుతున్నాడు. ఇత‌డే కాదు హిట్లు ఇచ్చిన చాలా మంది ద‌ర్శ‌కులు హీరోల డేట్లు దొర‌క‌క ఖాళీగానే ఉంటున్నారు. పాన్ ఇండియా హిరోలే కాదు..టైర్ 2, టైర్ 3 హీరోలు కూడా బిజీగానే ఉంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో కొత్త కుర్రాళ్లు మంచి కాన్సెప్ట్ ల‌తో రావ‌డంతో? ద‌ర్శ‌కుడిగా అనుభ‌వం లేక‌పోయినా డేట్లు ఇచ్చేస్తున్నారు. ఆ ర‌కంగా ఇండస్ట్రీలో నాలుగైదు సినిమాలు చేసిన అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కులు కూడా క్యూలో ఉండాల్సి వ‌స్తోంది.

Tags:    

Similar News