• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతలకు అందుబాటులోకి...

నిర్మాతలకు అందుబాటులోకి రాని పోసాని!?

By - Tupaki Desk
Update: 2021-10-01 11:30 GMT
ఏపీ ప్రభుత్వానికి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉన్న రాజకీయ గొడవల్లో తలదూర్చిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి జనసైనికుల ఆగ్రహ జ్వాలల్లో ఉన్నారు. ఆయన ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి కూడా చేశారు. ఈ క్రమంలోనే పోసాని ప్రస్తుతం వేరే అపార్ట్ మెంట్ లో ఉంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జనసైనికుల నుంచి బూతులతో ఫోన్లు, మెసేజ్ లు వస్తుండడంతో ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే  ప్రస్తుతం నిర్మాతలకు పోసాని అందుబాటులో లేకుండా పోయారన్న చర్చ టాలీవుడ్ లో సాగుతోంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ తో వివాదం పెట్టుకున్న పోసాని కృష్ణమురళి ఇప్పుడు   సినీ నిర్మాతలను అందుబాటులో రాలేదని సమాచారం. ఈ మేరకు సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు చేస్తోందని పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఫంక్షన్ లో విమర్శించారు. దానికి కౌంటర్ గా పోసాని దారుణంగా వ్యక్తిగత విమర్శలతో పవన్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత పోసాని ఇంటిపై దుండగులు దాడి చేసి హంగామా సృష్టించారు.

ఈ క్రమంలోనే పోసాని ఇప్పుడు తన ఇంటిలో కాకుండా వేరే చోట అపార్ట్ మెంట్లో ఉంటున్నట్టుగా చెబుతున్నారు. పోసాని చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్. ఈ క్రమంలోనే పోసాని  ప్రస్తుతం నిర్మాతలకు అందుబాటులో రాలేదని సమాచారం. కాంబినేషన్ షూటింగులకు అంతరాయం కలుగుతోందంటూ నిర్మాతలు వాపోతున్నట్టుగా సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బూతులు, బెదిరింపులు, మెసేజ్ లతో హోరెత్తిస్తుండడంతో ఆయన ఫోన్ ఆఫ్ చేసి ఉందని అంటున్నారు.  ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ తర్వాత కాంటాక్ట్ చేయడానికి కుదరడం లేదని పోసాని మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. నిర్మాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పోసాని ఎప్పుడు అందుబాటులోకి వస్తారో చెప్పలేమంటున్నారు.

ఏపీలో సినిమా టికెట్ల వివాదం రాజకీయంగా దుమారం రేపింది. పవన్ వర్సెస్ వైసీపీగా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు పోసాని వైసీపీకి మద్దతుగా పవన్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయనను వెంటాడుతూ వేధిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రాళ్ల దాడి కూడా ఆయన ఇంటిపై జరిగింది. తనకు ప్రాణహాని ఉందని పోసాని వ్యాఖ్యానించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పుడు నిర్మాతలకు అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశమైంది. 


Tags:    
  • Tollywood producers 
  • posani krishna murali 
  • posani krishna murali comments 
  • posani krishna murali fire 
  • Pawan kalyan 
  • Pawan kalyan comments 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS