ఆ బడా ప్రొడ్యూసర్ బయటపడేనా...?

Update: 2020-06-09 06:50 GMT
దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే మల్టీప్లెక్సెస్, థియేటర్లు మూసి వేశారు. టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అంతేకాకుండా సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని లక్షల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు నిబంధనలు సడలిస్తూ షూటింగులకు అనుమతిస్తున్నాయి. దీంతో ప్రొడ్యూసర్స్ ఆగిపోయిన షూటింగ్స్ మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఒక బడా నిర్మాత మాత్రం ఎటూ ఆలోచించుకోలేని సందిగ్ధంలో పడిపోయాడట.

దేశ వ్యాప్తంగా షూటింగులకు అనుమతులిస్తున్నా సినిమా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ ఓపెన్ చేసి సినిమాలను రిలీజ్ చేసినా సినిమాకి పెట్టిన బడ్జెట్ వెనక్కి తెచ్చేలా కనపడటం లేదు. కాగా ఆ బడా ప్రొడ్యూసర్ ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ మీద సుమారు 175 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. వాటిలో ఇద్దరు యువ హీరోలను నమ్ముకొని ఒక సినిమా తీసి సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధం చేసాడు. అయితే కరోనా వచ్చి ఆ సినిమాని బయటకు రాకుండా చేసింది. దీంతో ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాల్సి ఉంది. అంతేకాకుండా ఒక సీనియర్ హీరో కంబ్యాక్ మూవీకి కూడా ఈయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ స్టార్ హీరో స్టామినాని నమ్ముకొని ఈ సినిమాకి సదరు నిర్మాత బాగానే ఖర్చుపెట్టాడట. ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకున్నా.. ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నా.. ఆ సినిమా అంత వాసులు చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.

దీంతో పాటు ఈ నిర్మాత తెలుగులో హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. ఇలా డబ్బులు మొత్తం ఆ సినిమాలలో ఇరుక్కు పోవడంతో ఈ ప్రొడ్యూసర్ మరో సినిమా కూడా అనౌన్స్ చేయలేకపోతున్నాడట. అంతేకాకుండా బడా సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకోలేక పోతున్నాడట. కాగా ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా బయటకి వస్తే ఆ ప్రొడ్యూసర్ అంతో ఇంతో రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితులను తట్టుకొని ఆ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి.
Tags:    

Similar News