• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు క్రాక్‌ కు...

అప్పుడు క్రాక్‌ కు ఇప్పుడు అఖండ కు.. ఓటీటీ సమస్య

By - Tupaki Desk
Update: 2022-01-03 04:43 GMT
గత ఏడాది సంక్రాంతికి విడుదల అయిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రవితేజ కు క్లిష్ట సమయంలో మంచి విజయాన్ని ఆ సినిమా ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసుకునేలా ఆహా వారితో ఒప్పందం చేసుకున్నారట. అయితే సినిమా కు మంచి టాక్ వచ్చి వసూళ్లు సంక్రాంతి సీజన్ దాటి తర్వాత కూడా వస్తుండటంతో ఆహా వారితో అగ్రిమెంట్‌ ను మార్చుకుని వారికి కొంత మొత్తం రిటర్న్‌ ఇచ్చి ఓటీటీ స్ట్రీమింగ్‌ వారం పది రోజులు ఆలస్యం చేసినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నిజా నిజాలు గురించి క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ఆసక్తి చూపించలేదు. కాని ఆహా లో అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగానే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో అఖండ కు కూడా సమస్య తప్పేలా లేదు.

అఖండ సినిమా ను విడుదలకు ముందే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కు ఇవ్వడం జరిగింది. భారీ మొత్తానికి సినిమా విడుదల అయిన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‌ చేసేందుకు ఓటీటీ ఒప్పందం జరిగింది. సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో భారీ మొత్తాన్ని హాట్‌ స్టార్‌ వారు ఈ సినిమాకు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్‌ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. సినిమా విడుదల అయిన నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది. డిసెంబర్ 2వ తారీఖున అఖండ విడుదల అయిన విషయం తెల్సిందే. అంటే ఇప్పటి వరకు సినిమా స్ట్రీమింగ్‌ మొదలు పెట్టాలి. కాని సినిమా కు ఇంకా కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. మొన్న కొత్త సంవత్సరం సందర్బంగా అఖండ మళ్లీ హౌస్ ఫుల్‌ కలెక్షన్స్ ను రాబట్టింది.

ఒక వైపు థియేటర్ లో మంచి షేర్‌ ను దక్కించుకుంటున్న సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయడం వల్ల నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ మరియు బయ్యర్లు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ వారికి రిక్వెస్ట్‌ చేసి స్ట్రీమింగ్ వాయిదా వేయించినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి వరకు కూడా అఖండ జోరు కొనసాగుతుందేమో అనిపిస్తుంది. మరి అప్పటి వరకు అఖండ ను స్ట్రీమింగ్‌ చేయకుండా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ ఆగుతుందా అనేది చూడాలి. సినిమా విడుదల అయిన నాలుగు వారాల్లో అంటూ ఇప్పటికే ఒప్పందం ఉంది కనుక మరో వారం రోజులు ఆగితే పర్వాలేదు కాని సంక్రాంతి వరకు ఆగాలంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కు మరీ నష్టం తప్పదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ నష్టం ను హాట్ స్టార్‌ భరిస్తుందా లేదా నిర్మాతల నిర్ణయం ఏంటి అనేది చూడాలి.
Tags:    
  • Bala krishna 
  • Bala krishna akhanda movie 
  • Gopichand Malineni 
  • Gopichand Malineni movies 
  • krack 
  • nbk107 
  • hotstar 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS