ప్రియాంక చేతుల మీదుగా ఆస్కార్..

Update: 2016-02-02 06:55 GMT
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్ రూట్ లోకి వెళ్లిపోయింది. హాలివుడ్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడీ షోకి రెండో భాగం కూడా షూటింగ్ స్టార్ట్ కానుంది. దీనికి ముందే క్వాంటికోలో చేసిన అలెక్స్ పర్రిస్ పాత్రకుగాను ఈ భామకి పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ కూడా అందుకుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆడియన్స్ మన్ననలు పొందిన పీసీ.. ఇప్పుడు మరో అరుదైన అవకాశం కూడా దక్కించుకుంది.

ఈ నెలాఖర్లో జరగనున్న ఆస్కార్ అవార్డుల పండుగలో ప్రెజెంటర్ గా ఎంపికయింది ప్రియాంక చోప్రా. అవార్డులను ప్రదానం చేసే వారి పేర్లను అస్కార్ అకాడమీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన 13మంది జాబితాలో ప్రియాంక చోప్రా పేరు కూడా ఉండడం విశేషం. అంటే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక మెరిసిపోనుందన్న మాట. ఫిబ్రవరి 28(మన టైమ్ లో 29 తెల్లవారు ఝాము)న జరగనున్న ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఆ అద్భుతమైన రాత్రి కోసం ఆతృతగా ఉన్నానంటూ ట్విట్టర్ పోస్ట్ చేసింది  ప్రియాంక.

రీసెంట్ గా ఈ భామ నటించిన బాజీరావు మస్తానీ మూవీకి గాను.. ఫిలింఫేర్ నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న ప్రియాంక.. త్వరలో జై గంగాజల్ చిత్రంతో పోలీస్ పాత్రలో కనిపించనుంది.

Tags:    

Similar News