సెల్ఫీతో ఫిదా చేస్తున్న గ్లోబల్ బ్యూటీ!!

Update: 2020-07-31 07:10 GMT
ప్రస్తుతం సినిమా హీరో హీరోయిన్లంతా ఎన్నడూ లేని విధంగా ఇళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. సరదాగా కుటుంబంతో గడపడం, పిల్లలతో ఆడుకోవడం, గార్డెనింగ్, కొందరేమో కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు వినడం ఇలా ఏదోకటి చేస్తూ బిజీగా ఉన్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే పాప్ సింగర్ నిక్ జోనస్ తో హోమ్ క్వారంటైన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ జంటకి కొత్తగా పెళ్లయింది కదా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో నివసిస్తూ వివాహ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. ఎలాగో గృహ నిర్బంధంలో ఉంది కదా.. సరదాగా వంటలు చేస్తూ.. ఫిట్నెస్ ప్రయోగాలు చేస్తూ కాలం గడిపేస్తుందేమో.. అనుకుంటే పొరపాటే. హాలీవుడ్ సినిమాలలో అవకాశం వచ్చాక ప్రియాంక అసలు మళ్లీ ఇండియన్ సినిమాలలో కనిపించలేదు. పూర్తిగా ఇంగ్లీష్ సీరియల్స్, వెబ్ సిరీస్లు, సినిమాలపై దృష్టి పెట్టింది. ఇటీవలే నిక్‌, నేను ఒకేచోట ఉంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

కాలేజీ సమయంలోనే మోడలింగ్ మొదలు పెట్టిన ప్రియాంక.. 2000లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత మెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్లింది. 'ది హీరో' మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. 2008లో ఫ్యాషన్ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకుంది. ప్రియాంక ప్రస్తుతం అమెరికన్ అమ్మాయిలా మారిపోయింది. కట్టు బొట్టు మొత్తం పాశ్చాత్య సంస్కృతినే ఫాలో అవుతోంది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఏదొక పోస్ట్ తో అభిమానులను అలరిస్తుంది. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఓ సెల్ఫీ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడిని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. సూర్యకాంతిలో ముద్దుగుమ్మ అందం రెట్టింపు అయినట్లే అనిపిస్తుంది. సన్ గ్లాసెస్ ధరించి అందంగా పోజిచ్చింది. అలా ఆమె గ్రే హెయిర్ చేతులతో కోమలంగా నిమురుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Tags:    

Similar News