మంగళసూత్రంతో సర్ ప్రైజ్ ఇచ్చిన బ్యూటీ!

Update: 2019-04-25 07:24 GMT
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడిన తర్వాత అమెరికాలో కాపురం పెట్టేసింది కానీ ఇండియాలో ఆమె అభిమానులు ఆమె ప్రతి కదలికను ఫాలో అవుతున్నారు.  ఈమధ్య అదేదో మాయదారి బ్రిటిష్ మ్యాగజైన్ ప్రియాంక - నిక్ జంట విడాకుల దిశగా అడుగులేస్తున్నారు అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.  కానీ ఆ మ్యాగజైన్ కథనంలో నిజం లేదని తర్వాత జనాలకు అర్థం అయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంకకు సంబంధించిన మరో విషయం హాట్ టాపిక్ అయింది.

ప్రియాంక ఈమధ్య ఒక విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్చల్ చేస్తోంది.  ఆమెకు బిరుదే గ్లోబల్ సుందరి కాబట్టి ఫోటోలో చాలా అందంగా ఉంది. నిమ్మపండు రంగు టీ షర్ట్.. కళ్ళకు ఆధునికత ఉట్టిపడే కళ్ళజోడు.. అంతా అల్ట్రాస్టైలిష్ గా ఉంది.  కానీ.. మనసులో మాత్రం ప్రియాంక భారతీయ మహిళ అన్నట్టుగా మెడలో మంగళసూత్రం కూడా ఉంది.  వజ్రాలతో కూడిన సన్నటి గోల్డ్ చెయిన్..మధ్యలో నల్లపూసలు..  సూపర్బ్ గా ఉంది.  ఇక చెప్పేదేముంది.. ఇంటర్నెట్ లో ఈ ఫోటో వైరల్ అయింది.  అసలే నిక్ - ప్రియాంక విడాకుల వార్తలు..ఇలా హంగామా జరిగింది కదా అందుకే చాలామంది నెటిజనులు ఈ మంగళ సూత్రం ఫోటోతో అవాక్కయ్యారు.

ఈ ఫోటోకు కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా పెట్టారు. ఒకరు షారూఖ్ సినిమా టైటిల్ "ఫిర్ భీ దిల్ హై హిందుస్తాని" అని కరెక్ట్ గా క్యాప్షన్ ఇచ్చారు. మరొకరు "అమెరికా కోడలయినా ఇలా భారతీయతను గుర్తు చేసేలా మంగళ సూత్రం ధరించడం గొప్ప విషయం" అని మెచ్చుకున్నారు.  ఏదో ఇప్పుడు జనాలు మెచ్చుకున్నారని ప్రతిసారి మెచ్చుకుంటారని అనుకోకండి. సేమ్ నెటిజనులు గతంలో ప్రియాంక మంగళసూత్రం లేకుండా కనిపించినందుకు ఆడిపోసుకున్నారు.


Tags:    

Similar News