• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: సరదా మెట్...

ఫోటో స్టోరీ: సరదా మెట్ గాలా.. సూపర్ గా ఉందిగా!

By - Tupaki Desk
Update: 2020-05-05 10:50 GMT
గ్లోబల్ సుందరిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది.  నిక్ జోనాస్ తో వివాహం తర్వాత అక్కడే సెటిల్ అయింది. ఎంత గ్లోబల్ సుందరిగా మారినప్పటికీ  ప్రియాంకకు భారత దేశంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.  అందుకే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి అప్డేట్ ఇచ్చినా అది వెంటనే వైరల్ గా మారుతుంది. తాజాగా ప్రియాంక ఇచ్చిన ఒక అప్డేట్ అలాగే అందరినీ ఆకర్షించింది.

ప్రతి ఏడాది మే నెలలో మొదటి సోమవారం మెట్ గాలా ఈవెంట్ జరుగుతుంది. న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ కు పలువురు హాలీవుడ్ నటీనటులు హాజరవుతారు. హాలీవుడ్ నటీనటులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి సెలబ్రిటీలు హాజరై రెడ్ కార్పెట్ పై నడిచి ఫ్యాషన్ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. ఈసారి కరోనా క్రైసిస్ కారణంగా మెట్ గాలా ఈవెంట్ ను వాయిదా వేశారు. దీంతో ప్రియాంక చోప్రా మెట్ గాలా ఈవెంట్ ను సరదాగా ఇంట్లోనే నిర్వహించింది.  దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.  ఈ ఏడాది థీమ్ 'ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్' అని వెల్లడించింది.  

ఈ థీమ్ లో భాగంగా ప్రియాంకకు చిన్న పాప స్కై కృష్ణ మేకప్ చెయ్యడం విశేషం. ఇక ఈ ఫోటోలలో ప్రియాంక డెనిమ్ రాప్ అరౌండ్ డ్రెస్ ధరించింది. స్కై తన తలపై ఒక కీరీటం పెడుతుంటే ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పుడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లాంటిది ఇవ్వడం గమనార్హం. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఫోటోను పోస్ట్ చేసిన ఎనిమిది గంటల్లోనే 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి.  నిజం మెట్ గాలా డ్రెస్సులు.. ఆ మేకప్ కంటే ఈ ఉత్తుత్తి మెట్ గాలా సరదా మేకప్ అదిరిపోయిందని కొందరు కామెంట్ చెయ్యడం కొసమెరుపు.
Tags:    
  • Priyanka Chopra finds her new makeup artist in niece Sky Krishna 
  • Priyanka Chopra 
  • Priyanka Chopra Latest Images 
  • Priyanka Chopra Met Gala 2020 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS