ప్రియమణికి కోపం వచ్చేసిందిగా..

Update: 2016-02-16 03:53 GMT
''చాలా హాట్‌ గా ఉన్నావ్‌ లక్ష్మి రాయ్‌. సూపరుంది పోస్టర్‌. బాలీవుడ్‌ లో అడుగు పెడుతున్నందుకు నీకు కంగ్రాట్స్‌'' అంటూ సోషల్‌ నెట్వర్క్‌ లో తెగ పొగిడేసింది డస్కీ సుందరి ప్రియమణి. అయితే ఈ పొగడ్తలు కొంతమంది ఫాలోవర్లకు అంతగా నచ్చలేదు. క్రిటిక్స్‌ సదరు ''జూలీ 2'' పోస్టర్‌ గురించి ఎలాగైతే పెదవి విరచేశారో.. ఇప్పుడు కామన్‌ ఆడియన్స్‌ కూడా ఈ విషయం గురించి ప్రియమణిని అలాగే కడిగేశారు.

''కేవలం ఒళ్లు చూపించేస్తే.. అది హాట్‌ అవుతుందా? హాట్‌ అంటే ఇంకా చాలా విధాలుగా ఇంప్రెస్‌ చేయొచ్చు'' అంటూ ఒక అభిమాని తిరిగి బదులిచ్చాడు. దానితో ప్రియమణికి విపరీతంగా కోపమొచ్చింది. ''నేను జెన్యూన్‌ గా తన అందాన్ని మెచ్చకున్నాను. బాడీ షోయింగ్‌ అంటూ మాట్లాడొద్దు'' అని చెప్పుకొచ్చిందీ భామ. అసలు ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దు.. అజ్జానులను వదిలేయడమే బెటర్‌ అంటూ లక్ష్మి రాయ్‌ కూడా ఈ విషయంలో స్పందించింది.

అయితే ప్రియమణి మాత్రం.. ''ఒక్కోసారి ఇలాంటి వారికి సమాధానం చెప్పకుండా ఉండకూడదు. వీళ్లకి తేడా ఏంటో చెప్పాలి '' అంటూ ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అసలు కామెంట్‌ చేసిన ఆ వ్యక్తి మాత్రం మొదటి పంచ్‌ కే సైలెంట్‌ అయిపోయాడు.
Tags:    

Similar News