• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా కుర్ర హీరోతో బాలయ్య...

మెగా కుర్ర హీరోతో బాలయ్య ఢీ

By - Tupaki Desk
Update: 2019-10-27 01:30 GMT
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఆరంభంలోనే 'ఎన్టీఆర్‌' రెండు పార్ట్‌ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ రెండు పార్ట్‌ లు కూడా నిరాశ పర్చడంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అని చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే బాలయ్య 105 చిత్రం మొదలైంది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని సి కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి లేదా ఆ తర్వాత బాలయ్య 105 వస్తుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా బాలయ్య 105 డిసెంబర్‌ 20న రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

నేడు దీపావళి సందర్బంగా బాలకృష్ణ సినిమాకు 'రూలర్‌' అనే టైటిల్‌ ను ఖరారు చేస్తూ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడంతో పాటు విడుదల తేదీని చాలా ముందే ప్రకటించారు. చాలా స్పీడ్‌ గా పూర్తి అయిన ఈ సినిమాను డిసెంబర్‌ 20న విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ లో ఒకింత ఆందోళన నెలకొంది. అదే రోజున అంటే డిసెంబర్‌ 20వ తారీకునే మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ 'ప్రతి రోజు పండుగే' చిత్రం విడుదల కాబోతుంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతి రోజు పండుగే చిత్రం ఇటీవలే టీజర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా అనిపించింది. సినిమాకు మంచి టాక్‌ వస్తుందని.. మరో విజయాన్ని సాయి ధరమ్‌ తేజ్‌ తన ఖాతాలో వేసుకుంటాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అదే రోజున రూలర్‌ కూడా రాబోతుంది అంటూ ప్రకటన రావడంతో కాస్త గందరగోళం క్రియేట్‌ అవుతుంది.

రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ అయితే రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్‌ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కనుక అప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో ఏదైనా ఒక సినిమా విడుదల తేదీని ఒకటి రెండు రోజులు అటు ఇటు ఏమైనా చేంజ్‌ చేసుకుంటాయేమో చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకేరోజున విడుదలైతే పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయి.
Tags:    
  • Prati Roju Pandage Movie 
  • Balakrishna 
  • Ruler Movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS