• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరీ నోట్లో బూతు కూడా...

పూరీ నోట్లో బూతు కూడా అందమే

By - Tupaki Desk
Update: 2016-10-05 16:32 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్  లో రూపొందిన ఇజం మూవీ  ఆడియో లాంఛ్ ఫంక్షన్ లో  హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నందమూరి హరికృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ లు ఈ వేడుకకు హాజరుకావడంతో.. మొత్తం ఫంక్షన్ కే నిండుదనం వచ్చేసింది. అయితే.. ఇజం ఆడియో సందర్భంగా.. ప్రకాష్ రాజ్ కొన్ని సంగతులు చెప్పుకొచ్చాడు. జనాలకు తెలిసిన వాటినే తెలియని యాంగిల్ లో చెప్పే పూరీ స్టైల్ లోనే ప్రకాష్ రాజ్ మాటలు ఉండడం విశేషం.

'బ్యాంకాక్ లో తను కొత్తగా చేసినదో ఏదో చూపించడానికి ల్యాప్ టాప్ తీసుకొచ్చినపుడే అనూప్ రూబెన్స్ చూశాను. పూరీ ఒకళ్లను చూశాడంటే.. ఏదో విషయం ఉన్నట్లే.  కొత్తవాళ్లతో ఏదో ఓ ప్రయత్నం చేస్తుంటాడు. మనం చూశాక అనూప్ తో మాట్లాడాను.. సాంగ్స్ మాత్రమే కాకుండా.. ప్రతీ సీన్ లోను.. మనకు తెలీకుండా మన వేళ్లు పట్టుకుని తీసుకెళ్తున్నట్లు ఉంటుంది. మళ్లీ రాజా(ఇళయరాజా)గారిని గుర్తు చేశావ్' అంటూ ఇజంకు సంగీతం అందించిన అనూప్ ను పొగిడేశాడు ప్రకాష్ రాజ్.

'కళ్యాణ్.. నాకు ఇతని ఆకలి తెలుస్తోంది.. పూరీ చేతిల్లో పడితే!.. పూరీకి విజన్ ఉంటుంది. నాలాంటి నటుడికి ఒక జిజ్ఞాస ఉంటుంది. నేను నేనుగా ఉంటానంటున్నా.. ఏదో తపన మనసులో ఉంటుంది. పూరీ గెటప్ ఇవ్వడం వేరు.. కానీ కళ్యాణ్ రామ్ ని చూస్తుంటే.. పూరీ తపన కనిపిస్తోంది. కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడో ప్రతీ ఒక్కళ్లకీ తెలుసు. తన బ్రదర్ తోనే పోటీ పడుతున్నాడు. నాలాంటి వాళ్లు గర్వించే యాక్టర్ ఎన్టీఆర్. పూరీ ఆకలి తెలుసు. పూరీ విజన్ తెలుసు' అన్నాడు ప్రకాష్ రాజ్.

ఇక పూరీ గురించి మాట్లాడేప్పుడయితే.. ప్రకాష్ రాజ్ లో భావాలన్నీ ప్లెయిన్ గా బయటకు వచ్చేశాయ్. 'జగ్గు.. పల్లెటూళ్లోనే ఉంటూ.. తెలుగుతనం అద్దుతాడు. డక్ అంటే బూతు అన్నాడు. కానీ బూతు కూడా ఎవరి నోట్లో అయినా అందంగా ఉంటే అది పూరీ దగ్గరే. బూతు బూతులా కాకుండా.. అది ఒక భాష అనిపించడం.. అది ఒక ఎక్స్ ప్రెషన్ మాదిరిగా భావాలను స్ఫురించేలా చేయడం పూరీ దగ్గరే తెలుస్తుంది. తెలుగు సినిమా మాస్ కి ఒక క్లాస్ టచ్ ఇస్తాడు' అంటూ పూరీ జగన్నాథ్ గురించి పూరీ స్టైల్ లోనే చెప్పాడు ప్రకాష్ రాజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Prakash Raj 
  • Puri Jagannath 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS