కేజీఎఫ్ 2 సెట్స్ నుంచి బెల్లంకొండ కోసం..!

Update: 2020-09-22 09:10 GMT
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ ‌రాజ్ సంద‌డి ఇటీవ‌ల ఏమంత క‌నిపించ‌లేదు. తాజాగా ఆయ‌న కూడా స్పీడ్ పెంచారు. లాక్ డౌన్ కార‌ణంగా ఐదారు నెల‌లుగా షూటింగ్ ల‌కు దూర‌మైన‌ ఆయ‌న మ‌ళ్లీ రీలోడ్ అయ్యారు. క‌న్న‌డలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అధీర సంజ‌య్ దత్ పాత్ర ఎంత కీల‌క‌మో ప్ర‌కాష్ రాజ్ పాత్ర కూడా అంతే కీల‌కం అన్న చ‌ర్చా సాగుతోంది. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది.

అక్క‌డ ముగించేశాక‌ ప్ర‌కాష్ ‌రాజ్ తాజాగా తెలుగు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం  `అల్లుడు అదుర్స్‌` చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్ కీ రోల్ లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్ లో మొద‌లైంది. లాక్ డౌన్ కి ముందే దాదాపుగా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యినా సోనుసూద్‌.. ప్ర‌కాష్ ‌రాజ్ ‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్ డ్ గా వుండిపోయింది.

తాజాగా ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. త్వ‌ర‌లో న‌భా న‌టేష్.., అను ఇమ్మాన్యుయేల్‌.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ల క‌ల‌యిక‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఇటీవ‌లి కాలంలో నాగార్జున‌.. త‌ర్వాత షూటింగుకి భ‌య‌ప‌డ‌కుండా ఎటెండ‌వుతున్న సీనియ‌ర్ స్టార్ ప్ర‌కాష్ రాజ్ అన్న చ‌ర్చా సాగుతోంది.
Tags:    

Similar News