'సైరా'లో మిల్కీకి ఉన్నంత స్కోప్?

Update: 2020-02-11 17:30 GMT
భారీ హిస్టారిక‌ల్ సినిమాలో అవ‌కాశం ద‌క్క‌డం అంటే చాలా స‌మీక‌ర‌ణాలు చూడాల్సి ఉంటుంది. ఆర్టిస్టు కు ఒక్కోసారి న‌టించేందుకు స్కోప్ ఉంటుంది. కొన్నిసార్లు అందుకు ఆస్కారం లేక‌పోవ‌చ్చు కూడా. మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా క్రేజీ పాన్ ఇండియా చిత్రాలు బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2తో పాటు సైరా న‌ర‌సింహారెడ్డిలోనూ న‌టించింది. అయితే బాహుబ‌లి సిరీస్ లో అవంతిక‌గా న‌టించేందుకు స్కోప్ అన్న‌దే లేకుండా పోయింద‌న్న‌ విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఏదో ఒక రొమాంటిక్ గీతం.. నాలుగైదు సీన్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది ఆ సిరీస్ లో. అయితే మెగాస్టార్ `సైరా న‌రసింహారెడ్డి` చిత్రంలో త‌మ‌న్నాకు న‌టించేందుకు ఆస్కారం క‌లిగింది. రాజన‌ర్త‌కిగా మిల్కీ బ్యూటీ న‌ట‌న‌కు చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అదంతా అలా ఉంచితే ఇప్పుడు ప్ర‌గ్య జైశ్వాల్ కి పీ.ఎస్.పీ.కే 27లో ఎలాంటి పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కింది? క్రిష్ ఏరికోరి ఎంపిక చేసుకున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతుండ‌డంతో ప్ర‌గ్య‌కు ఎలాంటి ఛాన్సిచ్చారో అంటూ ఒక‌టే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. బాహుబ‌లి లో అవంతిక‌లా తేలిపోతుందా? లేక సైరాలో రాజ‌న‌ర్త‌కిలా మ‌న‌సులు గెలుస్తుందా? అన్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

అయితే ప‌వ‌న్ - క్రిష్ కాంబినేష‌న్ చిత్రంలో ప్ర‌గ్య రోల్ మెయిన్ లీడ్ కానేకాదు. కేవ‌లం ఒక ప్ర‌త్యేక గీతం .. నాలుగైదు సీన్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే రోల్ అని చెబుతున్నారు. అయితే కంచె త‌ర్వాత ప్ర‌గ్య‌కు టాలీవుడ్ లో స‌రైన హిట్టు లేక కెరీర్ జీరో అయిపోయింది. వ‌రుస‌గా న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాపుల‌వ్వ‌డంతో ప్ర‌గ్య కెరీర్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఏదో అతిధి పాత్ర అయితే లాభం లేదు. అందుకే త‌న‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ నిరూపించుకునేంత స్కోప్ క‌ల్పించి ఉంటార‌న్న చ‌ర్చా సాగుతోంది. గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌గ్య అగ్గి రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. టోన్డ్ బాడీతో ప‌ర్ఫెక్ట్ ఫిగ‌ర్ ని మెయింటెయిన్ చేస్తోంది. త‌న‌తో ఐటెమ్ చేయించ‌వ‌చ్చు.. క‌త్తి యుద్ధాలు చేయించ‌వ‌చ్చు. ఇక ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా రోల్ చేస్తున్న హిస్టారిక‌ల్ మూవీ కాబట్టి ఇందులో ప్ర‌గ్య రోల్ ని ఎలా డిజైన్ చేశారు? అన్న‌దానికి క్రిష్ నుంచే స‌మాధానం రావాల్సి ఉంటుంది.


Tags:    

Similar News