ఫోటో స్టోరి: రంగ్ దే సెట్లో రంగ్ ప‌డిందిగా

Update: 2020-10-11 05:06 GMT
క్యారెక్ట‌ర్ న‌టి అయినంత మాత్రాన జోష్ అక్క‌ర్లేదా?  లైఫ్ లో కొత్త టింజ్ అవ‌స‌రం లేదా? అస‌లు స‌హాయ‌క తార‌లు ఎలా ఉండాలి? అన్న‌దానికి నిద‌ర్శ‌నం ప్ర‌గ‌తి మ్యాడమ్. రెగ్యుల‌ర్ గా తన వర్కౌట్లతో ఆన్ లైన్ లో దుమారం సృష్టించే ప్ర‌గ‌తి యాక్టివ్ అప్పియ‌రెన్స్ అభిమానుల‌ను పెంచుతోంది.

ఈ ఏజ్ లో జిమ్ తో క‌ష్టం ఎందుకులే అనుకునే చాలామంది మ‌హిళామ‌ణుల్లో స్ఫూర్తి నింపుతున్నారు ఈ సీనియ‌ర్ న‌టి. ఇప్ప‌టికే జిమ్మింగ్ కి సంబంధించిన‌ అనేక ఛాయాచిత్రాలను వీడియోలను ఇన్ స్టాలో ఆమె పంచుకుంటున్నారు. ప్రగతి టైమ్ ‌లైన్ ఫీడ్ అభిమానులలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈసారి కాస్త విభిన్నంగా త‌న కొలీగ్ నితిన్ తో క‌లిసి ఉన్న‌ప్పటి ఫోటోని ప్ర‌గ‌తి షేర్ చేసారు. ఇది ఆన్ లొకేష‌న్ క‌ల‌ర్ ఫుల్ స్టిల్.

ప్రగతి ఇన్ ‌స్టాగ్రామ్ లో రంగ్ దే ప్ర‌మోష‌న్ ని చేస్తున్నారు. నితిన్ తో క‌లిసి సీన్ లో న‌టించిన‌ప్ప‌టి ఓ ఫోటోని ఆమె పంచుకున్నారు. రంగ్ దే టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ ఛాయాచిత్రం అదిరింది. నితిన్ -ప్రగతి ఎరుపు రంగు దుస్తుల్లో స్ట‌న్నింగ్ ఫోజిచ్చారు.రంగ్ దే సెట్లో తీసిన ఈ ఫోటో చూశాక‌.. నితిన్ ఫ్యాన్స్ రంగు ప‌డిందిగా! అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News