మ‌ళ్లీ సెట్లో `స‌లార్` సంద‌డి షురూ?

Update: 2022-06-08 16:30 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కేజీఎఫ్ 2`. ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ ఇది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిరగందూర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. చాప్ట‌ర్ 1 దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో చాప్ట‌ర్ 2 పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. చాప్ట‌ర్ 1 విడుద‌లైన నాలుగేళ్ల విరామం త‌రువాత చాప్ట‌ర్ 2 థియేట‌ర్ల‌లోకి రానుండ‌టంతో ఈ మూవీ కోసం యావ‌త్ దేశం వ్యాప్తంగా వున్న సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు.

ఫైన‌ల్ గా ఆ ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ `కేజీఎఫ్ 2` ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఐదు భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన ఈ మూవీ అంచ‌నాల‌కు మించి వుండ‌టంతో దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు రాఖీ భాయ్ కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో ఈ మూవీకి ఊహించిన‌ట్టుగానే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిసింది. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాదిలో ఈ సినిమాకు ఎదురే లేకుండా పోయింది. అక్క‌డ రికార్డు స్థాయిలో రూ. 433.74 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అక్క‌డి వారిని విస్మ‌యానికి గురిచేసింది.

ఇక వ‌రల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో ఈ మూవీ ఏకంగా రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దేశ వ్యాప్తంగా హీరో య‌ష్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ల‌ని క్రేజీ స్టార్ లుగా మార్చింది. పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా `స‌లార్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ నిర్మాత విజ‌య్ కిరగందూర్ ఈ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా రాజ‌మ‌నార్ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు, మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్ర‌భాస్ కు జ‌రిగిన మైన‌ర్ ఆప‌రేష‌న్ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ప్ర‌భాస్ కోలుకోవ‌డంతో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని బుధ‌వారం ప్రారంభించిన‌ట్టుగా తెలిసింది. హైద‌రాబాద్ లో ని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంద‌ట‌.

స‌లార్ షూటింగ్ స్పాట్స్‌.. ప్ర‌భాస్ ఐడీ కార్డ్ అంటూ కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. `కేజీఎఫ్‌` సిరీస్ చిత్రాల‌కు వన్ గౌడ ఫొటోగ్ర‌ఫీ అందించిన భువ‌న్ గౌడ‌, సంగీతం అందించిన‌ ర‌వి బాస్రూర్ ఈ మూవీకి కూడా వ‌ర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News