ప్ర‌భాస్ జాన్ స్క్రిప్టులో ఛేంజెస్ నిజ‌మా?

Update: 2019-09-28 12:41 GMT
సాహో రిజ‌ల్ట్ డార్లింగ్ ప్ర‌భాస్ ని ఆలోచ‌న‌ల్లో ప‌డేసిందా? అంటే అవుననే తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రం `జాన్` పై సాహో రిజ‌ల్ట్ ప్ర‌భావం ప‌డింద‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది. అది నిజ‌మేన‌ని తాజాగా అందిన సోర్స్ క‌న్ఫామ్ చేస్తోంది.

జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని ఇప్ప‌టికే 30రోజుల పాటు చిత్రీక‌రించారు. అయినా ఇప్పుడు ప్ర‌భాస్ స్క్రిప్టు లో మార్పుల్ని సూచించడంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భాస్ ప్యారిస్ ప‌ర్య‌ట‌న ముగించుకుని తిరిగి హైద‌రాబాద్ లో అడుగు పెట్టారు. వ‌స్తూనే త‌దుప‌రి సినిమాపైనా దృష్టి సారిస్తున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌భాస్ 20 గా చెబుతున్న ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ వినిపిస్తున్నా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌. యూర‌ప్ నేప‌థ్యంలో రిచెస్ట్ బిజినెస్ మేన్ గా ఈ చిత్రంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించి ప్రేమ కోసం ఎంత‌కైనా వెళ్లే వాడిగా డార్లింగ్ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఇప్ప‌టికే 30 రోజుల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఇప్పుడిలా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు? అంటే .. గ‌తంలో చిత్రీక‌రించిన విజువ‌ల్స్ మాటేమిటి?  అవి స్క్రాప్ లో వేసిన‌ట్టేనా? అంటూ అభిమానుల్లో సందేహం నెల‌కొంది. దీనిపై ప్ర‌భాస్ టీమ్ క్లారిటీని ఇస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News