బాహుబలి అంటే మామూలు విషయమా మరి?

Update: 2020-06-12 06:30 GMT
బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ ఇండియాలోనే టాప్‌ స్టార్‌ హీరోగా మారిపోయాడు. పాన్‌ ఇండియా క్రేజ్‌ ను దక్కించుకున్న ప్రభాస్‌ తన ప్రతి సినిమాను అదే స్థాయిలో చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమా సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో ఏ స్థాయిలో ఆడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి క్రేజ్‌ ఉన్న ప్రభాస్‌ ఏం చేసినా కూడా భారీగానే ఉంటుంది. వైరస్‌ పై పోరాటానికి విరాళం ఇచ్చినా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ విషయంలో కూడా ప్రభాస్‌ స్థాయి ఏంటో తెలిసి పోతుంది.

ఇక తాజాగా ప్రభాస్‌ ఏకంగా ఒక అడవిని దత్తత తీసుకున్నాడు. తెలంగాణ ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా ప్రభాస్‌ తన ఇంట్లో చెట్టును నాటిన విషయం తెల్సిందే. అంతే కాకుండా కీసర అడవిని మొత్తం కూడా దత్తత తీసుకుని అందులో చెట్లను పరిరక్షించడం మరియు కొత్తగా చెట్లను నాటించడం చేయించనున్నాడు.

ఈ విషయాన్ని ఎంపీ సంతోష్‌ పేర్కొన్నారు. ప్రభాస్‌ తన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ను తర్వాత లెవల్‌ కు తీసుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రభాస్‌ కు అభినందనలు తెలియజేశాడు. బాహుబలి అంటేనే భారీ అని అర్థం అందుకే ప్రభాస్‌ ఏకంగా అడవినే దత్తత తీసుకున్నాడు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Tags:    

Similar News