35 రోజుల్లో క్లైమాక్స్..రూ.20 కోట్ల బ‌డ్జెట్‌!

బ‌డ్జెట్‌, గ్రాండియ‌ర్ విష‌యంలో ఏ హీరో, డైరెక్ట‌ర్ త‌గ్గ‌డం లేదు. స్టోరీ డిమాండ్ చేస్తే ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి, ఎంత ఖ‌ర్చు అయినా పెట్ట‌డానికి వెనుకాడ‌టం లేదు.;

Update: 2026-02-28 06:57 GMT

బ‌డ్జెట్‌, గ్రాండియ‌ర్ విష‌యంలో ఏ హీరో, డైరెక్ట‌ర్ త‌గ్గ‌డం లేదు. స్టోరీ డిమాండ్ చేస్తే ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి, ఎంత ఖ‌ర్చు అయినా పెట్ట‌డానికి వెనుకాడ‌టం లేదు. చిన్న సీన్ కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తూ త‌మ సినిమాపై ఉన్న న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తున్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ మూవీ టీమ్ వ‌ర్క్ చేస్తోంది. `విరూపాక్ష‌`, బ్రో వంటి సినిమాల త‌రువాల సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా `సంబ‌రాల ఏటి గ‌ట్టు`(SYG). ` ఇదొక మాసీవ్ ఎపిక్ యాక్ష‌న్ డ్రామా. రోహిత్ కె.పి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.



 


ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ హైఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామాలోని కీల‌క పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబు, సాయి కుమాన్ న‌టిస్తున్నారు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌మిట్‌మెంట్‌తో డెడికేటెడ్‌గా ప‌ని చేస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాల్లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం హై ఓల్టేజ్ యాక్ష‌న్ నేప‌థ్యంలో క్లైమాక్స్ స‌న్నివేశాల‌ని అత్యంత భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడు.



 


ఇప్ప‌టికే క్లైమాక్స్ షూటింగ్‌ని టీమ్ మొద‌లు పెట్టింది. మాసీవ్ స్కేల్‌లో నెవ‌ర్ బిఫోర్ అనే స్థాయిలో క్లైమాక్స్‌ని షూట్ చేస్తున్నారు. కేవ‌లం క్లైమాక్స్ సీన్స్ కోస‌మే మేక‌ర్స్ రూ.20 కోట్లు కేటాయించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ సినిమా టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారేలా చేస్తోంది. సినిమాకు అత్యంత కీల‌క‌మైన‌, హైలైట్‌గా నిలిచే ఈ క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం భారీ బ‌డ్జెట్‌ని కేటాయించ‌డ‌మే కాకుండా 35 రోజుల పాటు దీన్ని షూట్ చేస్తున్నారు. 35 రోజుల్లో 18 విభిన్న‌మైన యాక్ష‌న్ బ్లాక్స్‌ని షూట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ కెవిన్ నేతృత్వంలో వీటీని అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.



 


క్లైమాక్స్ నేప‌థ్యంలో వ‌చ్చే ఈ హైఓల్టేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు భార‌తీయ యాక్ష‌న్ మూవీస్‌ల‌లో స‌రికొత్త బెంచ్ మార్కుని సెట్ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్‌ని మ‌హాభార‌త కురుక్షేత్ర యుద్ధం స్థాయిలో అభివ‌ర్ణిస్తున్నారు. సినిమాపై ఉన్న పూర్తి న‌మ్మ‌కంతో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న ఆహార్యాన్ని, ప్ర‌త్యేకంగా మేకోవ‌ర్‌ని మార్చుకుని ఇందులో న‌టిస్తున్నాడు. `హ‌ను మాన్` వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సినిమాకు పంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ భారీ త‌నం ఉండేలా వీరు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ఇందు కోసం ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా స‌బ్జెక్ట్ డిమాండ్ మేర‌కు భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. టెక్నిక‌ల్‌గా ద‌ర్శ‌కుడు రోహిత్ కె.పీ ఈ మూవీని హై స్టాండ‌ర్డ్స్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అబ్బుర‌ప‌రిచే విజువ‌ల్స్‌తో, స‌ర్‌ప్రైజ్‌కు గుర‌య్యే హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తో రూపొందుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News