'విష్ణు విన్యాసం' లీక్.. ఏం జరిగిందో చెప్పిన హీరో, ప్రొడ్యూసర్
ఆ సమయంలో సినిమాకు కొన్ని నెలల క్రితం ఎదురైన లీక్ సమస్యపై హీరో విష్ణు, నిర్మాత సుబ్రహ్మణ్యం స్పందించారు.;
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు నిర్మించారు. మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఆ సమయంలో సినిమాకు కొన్ని నెలల క్రితం ఎదురైన లీక్ సమస్యపై హీరో విష్ణు, నిర్మాత సుబ్రహ్మణ్యం స్పందించారు. 'లీక్ సమయంలో అమౌంట్ ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారా?' అని అడగ్గా.. రీల్ రీల్ కు బ్లాక్ మెయిల్ చేశారని విష్ణు తెలిపారు. "చాలా ఇబ్బంది పడ్డాం. ఆ విషయంలో చాలా ప్రొడ్యూసర్ నలిగిపోయారు. కానీ మాపై ఎఫెక్ట్ చూపించలేదు. ఛాంబర్ కు వెళ్లాం. ఇండస్ట్రీ కూడా 100 శాతం సపోర్ట్ చేసింది" అని విష్ణు చెప్పారు.
ఆ తర్వాత విష్ణును 'సినిమా లీక్ అయ్యింది అన్నారు కదా ఎక్కడ నుండి లీక్ అయ్యిందో తెలిసిందా?' అని అడగ్గా.. "చెన్నై నుంచి లీక్ అయినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడేం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సింపతీ కోసం కాదు.. ఫ్యూచర్ సినిమాలకు ఇలా జరిగితే ఇబ్బంది పడతాం. మూవీ రిలీజ్ అయ్యాక మా అనుభవం చెప్తాం. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఎలా చూసుకోవాలో ప్రయత్నించాలి" అని చెప్పారు.
"మేం ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమా రిలీజ్ చేయడానికి కారణం డిసెంబర్ టైమ్ లో మూవీ మొత్తం లీక్ అయిపోయింది. ఎలా జరిగిందో తెలియదు. ఫోన్ లో చెప్తే నాకు అస్సలు అర్థం కాలేదు. కంప్లైంట్ కూడా ఇచ్చాం. కానీ అప్పుడే సినిమా చాలా వరకు స్ప్రెడ్ అయిపోవడంతో టెన్షన్ పడ్డాం. అప్పటికి పూర్తి అవ్వలేదు మూవీ. ఏం చేయాలనేది తెలియలేదు. బయటకు చెబితే.. వేరే విధంగా వెళ్తుంది" అని అన్నారు.
"యాంటీ వైరస్ చేసే బ్లాక్ మెయిల్ కు ధైర్యంగా ప్రొడ్యూసర్ ఎదుర్కొన్నారు. తక్కువ టైమ్ లో సినిమాను కంప్లీట్ చేశాం. ప్రమోషన్స్ కు పది రోజుల టైమ్ దొరికింది. అలాంటి టైమ్ లో ధైర్యంగా ఉన్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఆరు నెలల క్రితం మరో సినిమా విషయంలో ఇలాగే జరిగిందనేది తెలిసింది. మొత్తానికి బయటకు రాకుండా రిలీజ్ చేశాం" అని విష్ణు తెలిపారు.
ఆ తర్వాత లీక్ విషయంపై నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడారు. "నాకు తెలియగానే మొత్తం బాడీ షేక్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు గుర్తుకొచ్చింది. మా యూనిట్ నుంచి సినిమా బయటకు వెళ్ళింది. లాక్ వేయకపోవడం వల్ల లీక్ అయింది. ఆ మిస్టేక్ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఏం జరిగిందో తెలుసుకున్నాం. చాలా మంది అప్పటికే మూవీ చూసేశారు. చాలా కష్టపడి కంప్లీట్ చేసి రిలీజ్ చేశాం" అని చెప్పారు.