ఎన్టీఆర్ వదిలిన 'మృత్యుంజయ్' ట్రైలర్.. ఎలా ఉంది?
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. "ఇప్పుడు నా చేతిలో చిక్కు ముడి ఉంది.. అది కచ్చితంగా విప్పుతా" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న డైలాగ్ తో స్టార్ట్ అయింది.;
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం ఇటీవల రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో మరో మూవీ మృత్యుంజయ్ రానుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సస్పెన్స్ థ్రిల్లర్ లో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మృత్యుంజయ్ మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శనివారం ఉదయం విడుదల చేయించారు.
"సన్నీ చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. మా 18 ఏళ్ల స్నేహంలో సన్నీకి తన తండ్రి గుణ్ణం గంగరాజు గారి లాగే ప్రత్యేకమైన కథలు గుర్తించడంలో టాలెంట్ ఉందని నేను గమనించా. ఇప్పుడు ప్రత్యేకమైన స్క్రిప్ట్ తో నిర్మాతగా తన తొలి వెంచర్ మృత్యుంజయ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. గ్రిప్పింగ్ ఇంటెన్సిటీతో మృత్యుంజయ్ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది" అంటూ తారక్ పోస్ట్ చేశారు. సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. "ఇప్పుడు నా చేతిలో చిక్కు ముడి ఉంది.. అది కచ్చితంగా విప్పుతా" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న డైలాగ్ తో స్టార్ట్ అయింది. శ్రీవిష్ణు.. తండ్రిని కోల్పోయిన చిన్న పాపకు ప్రామిస్ చేస్తారు. ఆ తర్వాత మల్టీపుల్ గెటప్స్ లో కనిపిస్తారు. విక్రాంత్ అనే చనిపోయిన వ్యక్తి విషయంలో పోరాడుతారు. చివరకు ఏం జరిగింది? చిన్నారికి ఇచ్చిన ప్రామిస్ ను శ్రీవిష్ణు నెరవేర్చారా? లేదా? అన్నది సినిమాగా తెలుస్తోంది.
అయితే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సెటిల్డ్ యాక్షన్ తో మెప్పిస్తున్నారు. వివిధ గెటప్స్ లో పెర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు కనిపిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. హుస్సేన్ షా కిరణ్ సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ రాసుకున్నట్లు అర్థమవుతోంది.
విజువల్స్ నేచురల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. నిర్మాతలు సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి.. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడనట్లు తెలుస్తోంది. కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రైలర్ కు బిగ్ అసెట్ గా మారింది. ఓవరాల్ గా ట్రైలర్ అందరినీ మెప్పిస్తూ సినిమాపై బజ్ పెంచుతోంది. మరి మార్చి 6న రిలీజ్ కానున్న మృత్యుంజయ్ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.