బాలయ్యతో మరోసారి డాక్టర్ కాత్యాయని...!
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వీర సింహారెడ్డి సినిమా వచ్చింది.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వీర సింహారెడ్డి సినిమా వచ్చింది. 2023లో వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో మూవీ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. గత ఏడాది నుంచే వీరి కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించిన చర్చ సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సమయంలోనే సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.
NBK111 లో హీరోయిన్‌గా నయనతార...
NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించబోతున్నట్లు గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. నయనతార బర్త్‌డే సందర్భంగా NBK111 యూనిట్ సభ్యుల తరపున ప్రత్యేకమైన వీడియో సైతం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలకృష్ణకు జోడీగా గతంలో భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్యతో మరోసారి జత కట్టేందుకు గాను కాజల్ అగర్వాల్ రెడీ అయ్యింది. నేడు కాజల్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా...
చీర కట్టులో, కళ్లకు పెద్ద అద్దాలు పెట్టుకుని హుందాగా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ లుక్‌తో సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లుక్, వెనుక ఉన్న సెటప్ చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉంటుందని కొందరు ఊహిస్తూ కామెంట్స్ చేస్తే, మరికొందరు ఐఏఎస్ పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లుగా అనిపిస్తోందని కొందరు అంటున్నారు. మొత్తానికి కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ రోల్ లో NBK111 సినిమాలో కనిపించబోతున్నట్లుగా ఈ ఫోటోను చూస్తే అనిపిస్తోంది. నయనతార ఎలాగూ ఈ సినిమాలో ఉంది కనుక కాజల్ అగర్వాల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండక పోవచ్చు అనే వారు లేకపోలేదు. అయితే గోపీచంద్ మలినేని తన ప్రతి సినిమాలో హీరోయిన్స్‌కి మినిమం ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం గత సినిమాలను చూస్తే అర్థం అవుతుంది. కనుక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కి మంచి పాత్ర దక్కి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బాలకృష్ణ ఫ్యాన్స్ ఎదురు చూపులు...
బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకు పోతున్నాడు. ఒకానొక సమయంలో బాలయ్య సినిమా వస్తుందంటే ట్రోల్ చేసేందుకు కొందరు రెడీగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలయ్య సినిమాలకు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో గోపీచంద్ మలినేని వంటి మాస్ కమర్షియల్ దర్శకుడితో బాలకృష్ణ మరోసారి సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. గత బాలయ్య సినిమాల బడ్జెట్‌తో పోల్చితే ఈ సినిమా బడ్జెట్ అంతకు మించి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు ఇప్పటికే సంగీతాన్ని ఇవ్వడం మొదలు పెట్టాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ పోస్టర్ తర్వాత ఆ ఆసక్తి మరింతగా పెరిగింది.