యంగ్ హీరోస్ హార్డ్‌కోర్ యాక్షన్ మంత్రం!
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల తరువాత హీరో క్యారెక్టర్ మరింత రఫ్ అండ్ టఫ్‌గా మారిపోయింది. మాసీవ్ క్యారెక్టర్లతో పాటు హార్ట్ కోర్ యాక్షన్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.;
గత కొంత కాలంగా సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒక దశలో రాముడు మంచి బాలుడు అనే స్థాయిలో సినిమాలుండేవి..రాను రాను అది కాస్తా మారిపోయి హీరోయిజానికి సరికొత్త భాష్యం చెప్పడం మొదలు పెట్టారు. ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇదే తరహా క్యారెక్టర్‌లలో హీరోలని చూడటానికి సినీ లవర్స్, అభిమానులు ఆసక్తిని చూపిస్తుండటంతో తెలుగు సినిమా హీరో కాస్తా ఇడియట్‌గా మారిపోయాడు. ఈ మధ్య కాలంలో ఇది మరో స్థాయికి చేరింది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల తరువాత హీరో క్యారెక్టర్ మరింత రఫ్ అండ్ టఫ్‌గా మారిపోయింది. మాసీవ్ క్యారెక్టర్లతో పాటు హార్ట్ కోర్ యాక్షన్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.
టైర్ టు హీరోల్లో అత్యధిక శాతం..
హింసాత్మక చిత్రాలకు ఇప్పుడు ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతూ కాసుల వర్షం కురిపిస్తుండటంతో టైర్ టు హీరోల్లో అత్యధిక శాతం ఇప్పడు హార్డ్ కోర్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కల్ట్ యాక్షన్ డ్రామాతో తనదైన మార్కుని చూపించబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్లింప్స్ ఇప్పటికే అంచనాల్ని పెంచేసింది. ఫిక్షన్ స్టోరీగా పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో మునుపెన్నడూ చూడని జడల్ క్యారెక్టర్‌లో నాని కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
అణగారిన ఓ జాతి కోసం, తల్లికిచ్చిన మాట కోసం కర్తాన్ని చిందిస్తూ భయంకరమైన యుద్ధం చేసిన ఓ కొడుకు కథగా దీన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ `రౌడీ జనార్థన`, `రణబాలి`. ఈ రెండు సినిమాలు కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామాలే. రవికిరణ్ కోల డైరెక్ట్ చేస్తున్న `రౌడీ జనార్థన` విజయ్ దేవరకొండ ట్రై చేస్తున్న డిఫరెంట్ హార్డ్ కోర్ యాక్షన్ డ్రామా.
ఇందులో విజయ్ క్యారెక్టర్, మేకోవర్ చాలా కొత్తగా ఉంటుంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. విజయ్ తన సినిమాలకు పూర్తి భిన్నమైన యాక్షన్ అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నాడు. గోదావరి యాసలో విజయ్ చెప్పే డైలాగ్‌లు, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే స్టోరీ. ఓ చక్కని ప్రేమకథ ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌లుగా తెలుస్తోంది.
మాస్ కా దాస్..శర్వా కూడా...
వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంచుకున్న థీమ్ హార్డ్ కోర్ యాక్షన్ డ్రామా. రీసెంట్‌గా చేసిన లైలా, `ఫంకీ` సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో మళ్లీ మాస్ మత్రాన్ని, హార్డ్ కోర్ యాక్షన్‌ని నమ్ముకున్నాడు. ఇందులో భాగంగానే విశ్వక్ నటిస్తూ డైరెక్ట్ చేస్తూ `కల్ట్` మూవీతో షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసి విశ్వక్‌లోని ఫైర్‌ని చూపించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని శర్వానంద్ కూడా ఫాలో అవుతున్నాడు. రీసెంట్‌గా సంక్రాంతి బరిలో నిలిచి `నారీ నారీ నడుమ మురారి` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఇంత వరకు భారీ యాక్షన్ మూవీ చేయని శర్వా తొలి సారి సంపత్ నంది రూపొందిస్తున్న `భోగి` మూవీతో మాసీవ్ యాక్షన్ డ్రామాని ట్రై చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచేసింది. `విరూపాక్ష` మూవీతో దాదాపు వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఈ సారి బాక్సాఫీస్‌ని గట్టిగా షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా `సంబరాల ఏటి గట్టు` మూవీ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ నెవర్ బిఫోర్ అవతార్‌లో మాసీవ్‌గా కనిపించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతోంది.