'విరోష్' పెళ్లి.. 'రణబాలి' స్పెషల్ సర్ప్రైజ్
విజయ్- రష్మిక జంటగా మరోసారి నటిస్తున్న రణబాలి మూవీ టీమ్ ఆ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుని ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.;
స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇంకా పెళ్లి హడావుడిలోనే ఉండగా.. వారిద్దరికి సంబంధించిన మ్యారేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది! విజయ్- రష్మిక జంటగా మరోసారి నటిస్తున్న రణబాలి మూవీ టీమ్ ఆ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుని ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.
అయితే రణబాలి మూవీ టీమ్ విజయ్- రష్మిక రియల్ మ్యారేజ్ వీడియో పోస్ట్ చేసిందనుకుంటే పొరపాటే! తమ సినిమాలోని పెళ్లి పాటకు సంబంధించిన గ్లింప్స్ ను శనివారం ఉదయం రిలీజ్ చేసింది. అంతే కాదు.. కొత్త జంటకు బెస్ట్ విషెస్ కూడా తెలిపింది. సినిమాలో రణబాలి, జయమ్మగా విజయ్ దేవరకొండ, రష్మిక కనిపించనుండగా.. వాళ్ల లవ్ ను స్పెషల్ సర్ప్రైజ్ తో సెలబ్రేట్ చేస్తున్నామని రాసుకొచ్చింది.
ఏందయ్యా సామి.. అంటూ సాగే పాటలో మేకర్స్ సినిమాలో విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన విజువల్స్ ను చూపించారు. పసుపు దంచడం, పెళ్లి, అత్తవారింట్లో జయమ్మ అడుగుపెట్టడం వంటి మూమెంట్స్ ను చూపించి మెప్పించారు. ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేశారు. అయితే విజయ్, రష్మిక కెమిస్ట్రీకి ఎవరూ ఫిదా అవ్వకుండా ఉండరేమో!
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తమ కెమిస్ట్రీతో విజయ్, రష్మిక మ్యాజిక్ చేసేటట్టు కనిపిస్తున్నారు. ఇద్దరూ నేచురల్ లుక్ తో తమ యాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. చివర్లో ఊయలలో ఇద్దరూ ఉన్న విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. అదే సమయంలో సాంగ్ కు సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగావలె తమ గాత్రంతో ప్రాణం పోశారు. తమ ప్లెజెంట్ వాయిస్ తో మెప్పించారు.
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే అజయ్- అతుల్ ద్వయం కంపోజ్ కూడా చేసింది. విజువల్స్ చాలా నేచరుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా రణబాలి మూవీ టీమ్.. ఏందయ్యా సామి పేరుతో ఇచ్చిన సర్ప్రైజ్.. ఏముందిరా సామి అన్నట్లు ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక రణబాలి విషయానికొస్తే.. రాహుల్ సాంకృత్యాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సీవాలాతో విజయ్ కు హిట్ ఇచ్చిన ఆయన.. మరోసారి ఛాన్స్ అందుకున్నారు. ఆర్నాల్డో వోస్లో సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కానుంది. ఏదేమైనా ఏందయ్యా సామి సాంగ్ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచిందనే చెప్పాలి.