ప్రభాస్‌ ఒక్కడిదే లేటండీ బాబూ

Update: 2016-05-12 17:30 GMT
అబ్బే ప్రభాస్‌ పెళ్లి గురించి కానే కాదు. సల్మాన్‌ ఖాన్‌ వంటి ఉద్దండులు ఉన్న ఈ దేశంలో మనం ప్రభాస్‌ ను తొందర పెట్టడం అస్సలు కరక్టే కాదు. అయితే ఇక్కడ మ్యాటర్‌ ఏంటంటే.. ప్రభాస్‌ తదుపరి సినిమాల గురించే చర్చంతా.

ఇప్పటివరకు బాహుబలి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన మిగతా కీలక నటుల గురించి తీసుకుంటే.. రానా బాబు హ్యాపీగా గాజి సినిమా.. ఆ తరువాత తేజ-కాజల్‌ తో మరో సినిమా.. ఇలా చేసుకుంటూ పోతున్నాడు. అనుష్క కూడా యముడు 3 చేసింది. ఇప్పుడేమో భాగ్మతి సైన్‌ చేసింది. అలాగే రమ్యకృష్ణ.. సత్యరాజ్‌.. వంటి కీలక నటులు కూడా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. సత్యరాజ్‌ బ్రహ్మోత్సవంతో వస్తున్నాడు. కాని ప్రభాస్‌ ఒక్కడే ఆ సినిమా ఒప్పుకున్నప్పటి నుండి మరో సినిమా ఏదీ చేయట్లేదు. ధూమ్ 4 లో అయినా కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్‌ ఉత్సాహపడితే.. అదంతా వట్టి రూమర్‌ అనే తేలింది.

ఎందుకిలా ప్రభాస్‌? చక్కగా రాజమౌళి ని అడిగి.. ఈ గ్యాప్‌ లో హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చుగా. పోనివ్‌ బాహుబలి 2 షూటింగ్‌ అయిపోయాక పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా కమిటయ్యాడా అంటే.. ఒక్క స్టార్‌ డైరక్టర్‌ తో కూడా మనోడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయట్లేదు. రన్‌ రాజా రన్‌ దర్శకుడితో ఒక సినిమా అని అన్నారు అంతే. ఏంటి బాసూ ఈ లేటు.. ఏదో ఒకటి సైన్‌ చేయవయ్యా.
Tags:    

Similar News