అకస్మాత్తుగా పెళ్లాడిన స్టార్ సింగర్! ఎందుకు ఇంత రహస్యంగా?
ర్యాపర్ బాద్షా నటి ఇషా రిఖితో కలిసి దిగిన పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడం అకస్మాత్తుగా అభిమానులను ఆశ్చర్యపరిచింది.;
ర్యాపర్ బాద్షా నటి ఇషా రిఖితో కలిసి దిగిన పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడం అకస్మాత్తుగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోలు చూడగానే వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ఊహాగానాలకు దారితీశాయి. ఇషా రిఖి తల్లి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో ఈ సందడి మొదలైంది.
ఆ ఫోటోలలో బాద్షా పెళ్లికొడుకుగా.. ఇషా పెళ్లికూతురి దుస్తులలో కనిపిస్తున్నారు. ఆ వీడియో క్లిప్‌లలో వారిద్దరూ ఫేరాలతో సహా సాంప్రదాయ వివాహ ఆచారాలను పాటిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. దీంతో ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. తన పోస్ట్ క్యాప్షన్‌లో ఇషా తల్లి ``దేవుడు మిమ్మల్ని దీవించుగాక`` అని రాశారు.
వారిద్దరి మధ్య సంబంధం ఉందని చాలా సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా బాద్షా గానీ.. ఇషా గానీ తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు. పుకార్లు ఎన్ని ఉన్నా వారు మీడియా దృష్టికి దూరంగా ఉంటూ తమ వ్యక్తిగత జీవితాలను సింపుల్ గా ఉంచారు.
అయితే ఈ ఫోటోలు వైరల్ అయినా ఈ పెళ్లికి సంబంధించి వారిద్దరి నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. దీంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఈ పెళ్లి నిజమేనని గట్టిగా నమ్ముతుండగా.. మరికొందరు ఇది ఒక ప్రైవేట్ వేడుక కావచ్చని లేదా ఆన్‌లైన్‌లో మళ్లీ వెలుగులోకి వచ్చిన పాత వీడియోలై ఉండవచ్చని భావిస్తున్నారు.
గతంలో జాస్మిన్ మసీహ్‌ను వివాహం చేసుకున్న బాద్షా 2020లో విడాకులు తీసుకున్నారు. ఈ రాపర్‌కు తన మాజీ భార్యతో ఒక కుమార్తె ఉంది. అప్పటి నుండి అతడు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు ప్రజల దృష్టికి దూరంగా ఉంచారు.
2024లో జాస్మిన్‌తో తన బ్రేకప్‌కు కారణాలను బాద్షా వెల్లడించారు. కలిసి ఉండటానికి తాము ఎంతగానో ప్రయత్నించినా కానీ.. తమ వివాహం తమ బిడ్డకు `ఆరోగ్యకరం కాదు` అని వారు నిర్ధారణకు వచ్చారని ఆయన వెల్లడించారు. మేమిద్దరం అన్ని విధాలుగా ప్రయత్నించాం. మా వంతు ఉత్తమంగా ప్రయత్నించాం. మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాం. మా బిడ్డకు అది మంచిది కానందున మేము విడిపోయాం. నేను నా బిడ్డను కలుస్తుంటాను.. కానీ ఆమె లండన్‌లో నివసిస్తున్నందున అంత తరచుగా కాదు`` అని బాద్షా ఇటీవల పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
ఇషా రిఖీతో అతడి వివాహం గురించి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి.. కానీ అవి ఎప్పుడూ అధికారికంగా నిర్ధారించలేదు.