బాహుబలి కంటే ముందు రజనీ చేశాడట

Update: 2017-06-27 13:23 GMT
ఇప్పుడు బాహుబలి క్రియేట్ చేసిన ప్రభంజనంతో ఇతర హీరోలు దర్శకులు ఏమో తెలియదు కాని.. అభిమానులు మాత్రం చాలా ఇన్ సెక్యురిటీ ఫీలవుతున్నారు. ఎందుకూ అంటారా? నిజానికి బాహుబలి సిరీస్ చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఇప్పుడు ఆ రికార్డులను ఆ క్రేజ్ ను టచ్ అయ్యేలా ఏదన్నా చేయడం కష్టం. కాబట్టి కొందరు ఈ సినిమాలోని సీన్లు కాపీ అంటూ కామెడీలు చేస్తే కొందరు ఈ సినిమా పెద్ద సూపర్ సినిమాయేం కాదంటూ సెటైర్లు వేస్తుంటారు.

అదిగో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు.. అసలు బాహుబలి సినిమాలో ఉన్న స్టంట్లు చాలామటుకు రజనీ ఎప్పుడో చేసేశాడు అంటున్నారు. ఉదాహరణకు సినిమాలో ప్రభాస్ అండ్ అనుష్క కలసి చేసే ఒక బాణాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది చూశారూ.. ముఖ్యంగా ఆ సీన్లో ప్రభాస్ అనుష్కకు ఒక విల్లు నుండి మూడు బాణాలు ఎలా రిలీజ్ చేయాలో నేర్పించే ఘట్టం బాగుంటుంది. అయితే ఈ సీన్ బాహుబలి 2 లో పెట్టడం ప్రథమం కాదని.. ఇదే సీన్ ఆల్రెడీ కూతురు సౌందర్య డైరక్షన్లో రజనీకాంత్ చేసిన యానిమేషన్ సినిమా 'కొచ్చాడయాన్'లో ఉందని ఫ్యాన్స్ కొందరు పేర్కొన్నారు. 'మన సూపర్ స్టార్ బాహుబలి కంటే ముందే ఇవన్నీ చేసేశారు' అంటూ ఒక అభిమాని సౌందర్యకు ట్వీట్ పెడితే.. 'అవును. నిజమే' అంటూ ఆమె రిప్లయ్ ఇచ్చింది. మొత్తానికి సూపర్ స్టార్ కూతురు కూడా బాహుబలి సినిమాను డౌన్ ప్లే చేయాలని చూస్తోందనమాట.

ఇప్పుడు మ్యాష్టారూ.. కత్తి యుద్దం ఉందనుకోండి.. రాజుల కాలం నాటి కథను ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావిస్తూ.. దానిని అదే రకంగా తీయాల్సిందే. అంతే కాని సడన్ గా పాత తరం హీరో కాంతారావు వచ్చేసి.. ఆ కత్తియుద్దాలన్నీ నేనే ముందు చేశాను అంటే ఎలా? అవన్నీ తరతరాల నుండి వస్తున్న యుద్ద కళలు కదా.. ఎవరైనా అలాగే చేస్తారు. ఏమంటావ్ సౌందర్య?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News