సింపుల్ గా స్మైలిచ్చి గాళ్స్ ని కిల్ చేస్తాడు గురుడు!

Update: 2021-06-25 01:30 GMT
అందంగా న‌వ్వ‌డం అద్భుత‌ క‌ళ‌. సింపుల్ గా న‌వ్వి బౌన్స‌ర్ వేయ‌డం కొంద‌రి ప్ర‌త్యేక‌త‌. చిరున‌వ్వుతో క్ష‌ణకాలం మైండ్ బ్లాక్ చేసే నిపుణులున్నారు. చూస్తుంటే డార్లింగ్ ప్ర‌భాస్ ఈ కోవ‌కే చెందుతాడు.

ఒక్క న‌వ్వుతో అలా స్పెల్ బౌండ్ చేసేశాడు డార్లింగ్. స్వీటీ అనుష్క‌.. సాహో శ్ర‌ద్ధ‌.. మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా.. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.. క‌థానాయిక ఎవ‌రైనా కానీ డార్లింగ్ స్మైల్ ని అభిమానించ‌ని నాయిక‌లే లేరు. అంత‌గా ప్ర‌భావితం చేస్తాడు కాబ‌ట్టే ప్ర‌భాస్ కి మ‌హిళాభిమానులెక్కువ‌ని చెబుతారు.

డార్లింగ్ మ‌న‌సు ఎంత అంద‌మైన‌దో ఆ న‌వ్వు కూడా అంత‌కుమించి అందంగా ఉంటుంద‌ని చెప్పేందుకు ఈ ఫోటోనే చాలు. అన్న‌ట్టు ప్ర‌భాస్ పెళ్లాడ‌బోయే మ‌గువ ఎవ‌రో కానీ ఈ స్మైల్ చూస్తే చాలు అంతే సంగ‌తి. అంత బ్యూటిఫుల్ గా స్మైలిచ్చాడు ప్ర‌భాస్. అత‌డు న‌టించిన రాధేశ్యామ్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. త్రోబ్యాక్ థ‌ర్స్ డే అంటే ఈ స్మైలీ ఫోటోని రాధేశ్యామ్ టీమ్ రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. త‌దుప‌రి స‌లార్ - ఆదిపురుష్ 3డి చిత్రీక‌ర‌ణ‌ల‌కు టీమ్ లు రెడీ అవుతున్నాయి. మ‌రోవైపు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీకి ప్ర‌భాస్ ముహూర్తం ఫిక్స్ చేయాల్సి ఉంది.
Tags:    

Similar News