కేజీఎఫ్ తర్వాత ఊహల్లో తేలుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్

Update: 2022-04-16 02:30 GMT
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన కేజీఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మాస్ ఆడియన్స్ ను మరియు యాక్షన్‌ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులను కేజీఎఫ్ 2 సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశంలోని ఎలివేషన్స్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

రాజమౌళి సినిమాలో హీరోల ఎలివేషన్స్‌ స్థాయిలోనే కేజీఎఫ్‌ 2 లో హీరో యశ్‌ ఎలివేషన్ ఉండటంతో ఆయన అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. హీరోయిన్‌ మరీ ఈ స్థాయిలో చూపించవచ్చా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ అభిమానులు అయితే ఊహా లోకంలో తేలిపోతున్నారు. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సలార్‌. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్‌ సినిమాలో హీరోయిజం ఎలా ఉండబోతుంది... హీరో పరిచయ సన్నివేశాలు.. ఎలివేషన్‌ గురించి ప్రభాస్ అభిమానులు ఊహించుకుంటూ గాల్లో తేలుతున్నంత పని చేస్తున్నారు.

హీరోగా రాధేశ్యామ్‌ తో ప్లాప్‌ అయిన ప్రభాస్ కు మరియు ఆయన అభిమానులకు సలార్ ఆశా దీపం అన్నట్లుగా కనిపిస్తుంది. సలార్ సినిమా తో మరో సారి పాన్ ఇండియా స్టార్‌ గా నిలుస్తే ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్‌ కు అది మరింతగా ఉపయోగదాయకం అవుతుంది అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యశ్‌ ను ఓ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్‌ సలార్ సినిమా లో ప్రభాస్‌ ను ఏ రేంజ్ లో చూపిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్‌ సినిమా లో ప్రభాస్ యొక్క స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తూనే కేజీఎఫ్ లోని యాక్షన్‌ సన్నివేశాలకు రెట్టింపు డోస్ యాక్షన్‌ సన్నివేశాలను చూపిస్తాడనే నమ్మకం తో ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి సలార్‌ సినిమా విషయం లో కేజీఎఫ్ 2 విడుదల అయిన తర్వాత ప్రభాస్ అభిమానులు గాల్లో తేలినట్లుగా ఊహాగానాలు చేస్తున్నారు. సలార్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయ్యిందట. శృతి హాసన్‌ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News