దీపిక‌పై ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ భగ భ‌గ.. అప్పుడే ఈగోలా?

Update: 2020-07-20 09:50 GMT
ప్ర‌భాస్ 21 క‌థానాయిక‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ దీపిక ప‌దుకొనేని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. డార్లింగ్ ప్ర‌భాస్ గ్లోబ‌ల్ స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీతో వెలుగుతున్నాడు. అలాంటి స్టార్ స‌ర‌స‌న దీపిక లాంటి లేడీ సూప‌ర్ స్టార్ జ‌త‌వ్వ‌డంతో ఇది పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అంటూ ప్ర‌చారం హోరెత్తుతోంది. కాంబినేష‌న్ అదిరిపోవ‌డంతో ప్ర‌భాస్ 21 క్రేజు అమాంతం స్కైని ట‌చ్ చేసింది. అయితే ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు న‌టిస్తున్న ఈ సినిమాని ఏక ప‌క్షం చేస్తూ `ప్ర‌భాస్ 21` అని మీడియాలు ప్ర‌స్థావించ‌డాన్ని దీపిక ప‌దుకొనే జీర్ణించుకోలేక‌పోతోందా? అంటే అవున‌నే ప్ర‌భాస్ అభిమానులు కౌంట‌ర్లు వేస్తున్నారు.

సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌తిదీ డిబేటే. ప్ర‌తిదీ వివాదాస్ప‌ద‌మే. ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపిక నాయిక అని అశ్వ‌నిదత్ - నాగ్ అశ్విన్ బృందం ప్ర‌క‌టించ‌డ‌మే గాక ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాలో న‌టిస్తున్నందుకు దీపిక త‌న సంతోషం వ్య‌క్తం చేసింది. ``థ్రిల్లింగ్ కి మించి ఫీల్ అవుతున్నా. అద్భుతమైన ప్ర‌యాణం కోసం వేచి చేస్తున్నా`` అని తొలి ట్వీట్ చేశారు. అయితే ఆ త‌ర్వాత‌నే అస‌లు గొడ‌వ మొద‌లైంది.

ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మ్యాగ‌జైన్ `వెరైటీ` వాళ్లు ప్ర‌భాస్ 21లో దీపిక క‌థానాయిక అంటూ రాసుకొచ్చింది. అయితే వెరైటీ మ్యాగ‌జైన్ అలా ప్ర‌స్థావించ‌డాన్ని దీపిక డైజెస్ట్ చేసుకోలేక‌పోయింద‌ని త‌న తాజా ట్వీట్ చెబుతోంది. దీపిక లేటెస్ట్ ట్వీట్ లో వెరైటీ వాళ్ల‌ను ఉద్ధేశించి స్పందించింది. ``మీరు రిపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌. కానీ ఈ సినిమా టైటిల్‌ ప్రభాస్ 21 కాదు. ప్రభాస్ నటించే 21వ చిత్రం ఇది. ఈ మూవీ హిందీ- తమిళ్- తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ద‌య‌చేసి నోట్ చేస్కోండి`` అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య‌లో టోన్ వేరేగా వినిపించింది డార్లింగ్ ఫ్యాన్స్ కి. ఇది కేవ‌లం బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ డామినేష‌న్ అని దీపిక భావిస్తోంద‌న్న భావ‌న స్ట్రెయిట్ గానే క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ ని హైలైట్ చేస్తూ త‌న‌ని త‌గ్గించ‌డంపై దీపిక ఫీల‌వుతోంద‌నే అభిమానులు అర్థం చేసుకున్నారు.

అందుకే దీపిక ట్వీట్ పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ భ‌గ‌భ‌గ మండుతున్నారు. ``టైటిల్ నిర్ణ‌యించే వరకు దాన్ని ప్రభాస్ 21 అనే పిల‌వాలి. పాన్ ఇండియా మూవీ అయినా తొలుత‌ ఇది తెలుగు చిత్రం`` అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ స్వాభిమానం చూపిస్తూ వేడిగా కామెంట్లు చేస్తున్నారు.

నీవేమైన గుడ్డిదానివా? అంత స్ప‌ష్ఠంగా చెప్పారుగా.. అని ఒక‌రు.. ఇంత షో పనికి రాదు.. అయినా ఇలాంటి కథలు సెట్స్ లో ఉండ‌గా ప‌డ్డావంటే కుద‌రదు అంటూ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు ప్ర‌భాస్ అభిమానుల్లో ఒక‌రు సూచించారు. ఓకవేళ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే నా వల్లే అని దీపిక‌ ఫీలవుతుందేమో అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. ఇలాంటి వేషాలు దక్షిణాది ప‌రిశ్ర‌మ‌ల్లో కుద‌ర‌దు.. ప్రభాసే రాజు!! అన్న వ్యాఖ్య‌లు క‌నిపించాయి. ప్ర‌భాస్ ని చూసి వ‌స్తారా?  లేక నిన్ను చూసి జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అంటూ కామెంట్లు పెట్టారు. ఇంత‌కీ ఇది ఈగో గొడ‌వ అనుకోవాలా?  లేక ఫ్యానిజం అనే స‌ర్ధి చెప్పుకోవాలా?
Tags:    

Similar News