మనోళ్లకు ఆదిపురుష్ ఎందుకు ఎక్కట్లేదంటే?

Update: 2023-06-18 13:00 GMT
ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసిన ఆదిపురుష్ థియేటర్లకు వచ్చేసింది. కానీ విడుదల అయిన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తోంది. మొదటి రోజు ఏకంగా 140 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇక రెండో రోజు వసూళ్లు తగ్గొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది అనడం, అందులోనూ ప్రముఖులు సైతం ఈ సినిమా కోసం టికెట్లు కొని ప్రమోట్ చేశారు. ఇక సినిమా రిలిజ్ అయిన ప్రతి థియేటర్లలో హనుమంతుడు వచ్చి చూస్తాడు అని సీటు వదలడం ఇవన్నీ చెప్పడంతో... సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

అయితే విడుదల అయ్యాక మాత్రం ఈ సినిమాపై విమర్శలు తలెత్తాయి. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు మనోళ్లు చూస్తారు.  కానీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా మాత్రం విమర్శలకు గురవుతుంది. ఎందుకంటే.. ఈ సినిమాలోని పాత్రల  ఆహార్యం, గ్రాఫిక్స్, డైలాగుల విషయంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడు డైలాగుల విషయంలో ట్రోల్స్ కూడా వచ్చాయి.  

ఇక తెలుగులో ఎన్ని రామాయణాలు వచ్చినా... మనోళ్లు ఆదరించారు. అవన్నీ సూపర్ హిట్టే.   రాముడు అంటే మనోళ్లకు గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. రాముడికి మీసాలు ఉండవు అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు మీసాలు ఉండటం.. రావణుడు పాత్రపై కూడా చాలా వరకు ట్రోల్స్ వస్తున్నాయి. తెలుగులో రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాల విషయానకి వస్తే... సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, లవ కుశ, భూకైలాస్, వీరాంజనేయ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి సినిమాను మనోళ్లు ఆదరించారు.

ఇవన్నీ టెక్నాలజీ లేని సమయంలో వచ్చి ప్రేక్షకులను మెప్పించారు.  అలాంటి క్లాసిక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులకు.. చాలా కృత్రిమంగా తయారైన ఆదిపురుష్ ను చూస్తే కోపం రావడంలో ఆశ్చర్యంలేదని చెప్పవచ్చు. అందుకే మనోళ్లకు ఈ ఆదిపురుష్ ఎక్కట్లేదనుకోవచ్చు. మొదటి రోజు బాగానే కలెక్షన్లు వచ్చినప్పటికీ.. రెండో రోజు ఎలా వస్తాయో చూడాలి.

Similar News