ప్ర‌భాస్ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్ అప్పుడేనట..?

Update: 2021-03-24 13:13 GMT
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వరుసగా నాలుగు చిత్రాల‌ను అనౌన్స్ చేశాడు. అందులో మూడు చిత్రాలు వ‌ర్కింగ్ లో ఉన్నాయి. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. స‌లార్‌, ఆదిపురుష్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే.. అన్నింటిలోనూ 'ఆదిపురుష్‌'పై సాధారణ ప్రేక్షకులతోపాటు, ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ క్యూరియాసిటీ నెలకొంది.

ఈ చిత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ అయ్యింది. నిజానికి తెలుగులో.. ఎన్టీఆర్‌, శోభ‌న్ బాబు త‌ర్వాత పెద్ద‌గా ఎవ‌రూ రాముడి పాత్ర వేయ‌లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ క‌నిపించిన‌ప్ప‌టికీ.. అది బాల‌రామాయ‌ణం కాబ‌ట్టి.. లెక్క‌లోకి తీసుకోలేం.

ప్ర‌భాస్‌ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న ఈ స‌మ‌యంలో రాముడి క్యారెక్ట‌ర్ పోషిస్తుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 'ఆదిపురుష్‌'లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు? అన్న‌దే అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే.. త్వ‌ర‌లోనే అభిన‌వ సినిమా రాముడిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ట మేక‌ర్స్‌.

ఏప్రిల్ 21న శ్రీరామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం. ఈ సంద‌ర్భంగానే 'ఆదిపురుష్'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోందట యూనిట్. ఈ సినిమాలో సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ క‌నిపించ‌నుండ‌గా.. రావ‌ణుడి పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News