ప్రభాస్‌ 21 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

Update: 2020-07-17 09:10 GMT
ప్రభాస్‌ 21వ చిత్రానికి సంబంధించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రభాస్‌ కు ఉన్న స్టార్‌ డం నేపథ్యంలో ఆయన జాతీయ స్థాయిలో ఏదో ఒక విషయంలో ట్రెండ్‌ అవుతూనే ఉన్నాడు. ఇటీవల ప్రభాస్‌ 21లో హీరోయిన్‌ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్‌ 21 చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో రూపొందుతుందట. ఈ చిత్రం కథానుసారంగా ప్రభాస్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. మళ్లీ నాగ్‌ అశ్విన్‌ కూడా ప్రభాస్‌ ను రెండు పాత్రల్లో చూపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ వార్త సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిని మించి ఉంటుందని ఇంగ్లీష్‌ లో కూడా డబ్‌ చేసి హాలీవుడ్‌ మూవీ రేంజ్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా నాగ్‌ అశ్విన్‌ ఆలోచనల్లో ఉన్నాడు.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్‌ పున: ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు. రాధేశ్యామ్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌ మూవీ మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభించి 2022 లో విడుదల చేయాలని నాగ్‌ అశ్విన్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలిని మించి ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కలిగి ఉన్నారు. మరి వారి అంచనాలను నాగ్‌ అశ్విన్‌ అందుకుంటాడా చూడాలి.
Tags:    

Similar News