వ్వాట్! ప‌వ‌న్ ని టెన్ష‌న్ పెడుతున్న గురూజీ!!

Update: 2020-09-05 08:10 GMT
ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ త‌న 49వ పుట్టిన రోజున బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ - ప్రీలుక్ - కాన్సెప్ట్ పోస్ట‌ర్ లని రిలీజ్ చేశారు. ఈ మూడు చిత్రాల‌పై ప‌వ‌న్ ప్ర‌త్యేక ఫోక‌ప్ పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. `వ‌కీల్ సాబ్‌` చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో వుంది. ఇక క్రిష్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా స్థాయి పిరియాడిక్ ఫిల్మ్ కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక హ‌రీష్ శంక‌ర్ తో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న చిత్రం ఇంకా ప్రారంభం కావాల్సి వుంది.

ఇదిలా వుంటే ఈ మూడు చిత్రాల‌తో పాటు ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ మ‌రో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అదే మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్ టైన్ ‌మెంట్స్ అధినేత సూర్యదేవ‌ర నాగ‌వంశీ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూవీ స్క్రిప్ట్ ని కొంత మంది రైట‌ర్స్ చేత తెలుగు నేటివిటీకి అనుగ‌ణంగా మాచ్చేశారు. కానీ కొంత అసంతృప్తిగా అనిపించ‌డంతో ఫైన‌ల్ ట‌చ్ కి సంబంధించిన బాధ్య‌త‌ల్ని మాట మాంత్రికుడు.. గురూజీ త్రివిక్ర‌మ్ కు అప్ప‌గించారు.

ఇదే చిత్రాన్ని ప‌వ‌న్ తో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ర‌క ర‌కాల హీరోల చేతులు మారి చివ‌రికి ఈ స్క్రిప్ట్ ప‌వ‌న్ ద‌గ్గ‌రికి వ‌చ్చి ఆగింది. అయితే ఈ చిత్రానికి త్రి‌విక్ర‌మ్ డైలాగ్స్ అందిస్తాన‌ని మాటిచ్చార‌ట‌. కానీ డైరెక్ష‌న్ మాత్రం చేయ‌లేన‌న్నార‌ట‌. కార‌ణం త‌న చేతిలో ఎన్టీఆర్ సినిమా వుండ‌ట‌మేన‌ని చెబుతున్నారు. క్లోజ్ ఫ్రెండ్ ప‌వ‌న్ కోసం గురూజీ టైమ్ కేటాయించ‌లేని స్థితిలో వున్నార‌ని ఇండ‌స్ట్రీలో కామెంట్ లు వినిపిస్తున్నాయి. అయితే ప‌వ‌న్ మాత్రం ఇంకా ఈ టీమ్ కి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌లేదంటే.. త్రివిక్ర‌మ్ కెప్టెన్ ప‌గ్గాలు చేడితే గానీ ప‌వ‌న్ ఈ చిత్రానికి ఓకే చెప్ప‌లేమో అంటున్నారు. మొత్తానికి ప‌వ‌న్ ని గురూజీ టెన్షన్స్ వ‌దిలేట్టు లేవు మ‌రి.
Tags:    

Similar News