ప్రొడ్యూసర్ ని టెన్షన్ పెడుతున్న పవర్ స్టార్ సినిమా..?
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసాడు. ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ మూవీ ''వకీల్ సాబ్'' ని నిర్మించే అవకాశం అందుకున్నాడు. 'పింక్' రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలసి దిల్ రాజు నిర్మించారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెట్టారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాల నిర్మాణంలో తలపండిన దిల్ రాజు.. ఫస్ట్ టైం పవన్ తో చేస్తున్న 'వకీల్ సాబ్' విషయంలో మాత్రం టెన్షన్ పడుతున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పవన్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో 'వకీల్ సాబ్' కు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని దిల్ రాజు ఆలోచిస్తున్నారట. ఈ సినిమా మెయిన్ స్టోరీ అందరికీ తెలుసు. ఇది మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా. అయితే తెలుగులో పవన్ కోసం ఈ సినిమాకి ఫైట్స్ - సాంగ్స్ - ఫ్లాష్ బ్యాక్ మొదలైన వాటిని జత చేసి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మార్చినట్లు టాక్. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ని బట్టి చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. ఇప్పటికే దిల్ రాజు ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కొత్త టీమ్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.