ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఏపీలో స్పెషల్ టికెట్ ధరలు... బెనిఫిట్ షో రేటు వింటే షాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.;

Update: 2026-03-12 09:42 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్..ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా విడుదలకు ముందు ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు ప్రత్యేక టికెట్ ధరలు పెట్టేందుకు నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. విడుదల రోజున జరిగే బెనిఫిట్ షోల కోసం ఒక్క టికెట్ ధరను సుమారు రూ.500 వరకు నిర్ణయించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో బెనిఫిట్ షోలు నిర్వహించడం సాధారణమే. పవన్ కళ్యాణ్ సినిమాలకు అభిమానుల నుండి భారీ స్పందన ఉండటంతో ఈ షోలు ఎక్కువగా నిర్వహించే అవకాశం ఉంది.

అంతేకాదు..రెగ్యులర్ షోల టికెట్ ధరలను కూడా పెంచాలని నిర్మాతలు కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై రూ.100 అదనంగా, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు పెంచాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

ఇదే విధంగా తెలంగాణలో కూడా ప్రత్యేక టికెట్ రేట్లు పెట్టే ఆలోచన ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అక్కడ కొన్ని చట్టపరమైన విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమా విడుదల రోజున బాలీవుడ్ సినిమా ధురంధర్ 2 కూడా విడుదల కానుంది. ఈ క్లాష్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ రెండు సినిమాలు వేర్వేరు జానర్లలో ఉంటాయని, పండుగ సమయంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు కూడా విజయవంతం కావచ్చని తెలిపారు.

మొత్తం పైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్‌కు ముందే టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ ప్రత్యేక ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ముందుగా ఈ సినిమాని మార్చి 26 విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రం మార్చి19 రానుంది. ఇక ఈ చిత్రం విడుదల రోజునే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 కూడా విడుదల కావడం గమనర్హం.

Tags:    

Similar News