కస్టడీ.. గట్టి టాక్ పడాల్సిందే!
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమా భవిష్యత్తు మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. మే 12వ తేదన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. థాంక్యూ సినిమాతో డిజాస్టర్ చవి చూసిన చైతూ కి ఈ హిట్ చాలా అవసరం. ఆ విషయం చైతూకి కూడా బాగా తెలుసు. అందుకే గ్యాప్ లేకుండా మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు.
ఎప్పుడూ లేనిది తమ విడాకుల గురించి, సమంత గురించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం ఇచ్చాడు. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పైనా స్పందించాడు. తన సినిమా జనాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో ఆయన ప్రమోషన్స్ లో గట్టిగా పాల్గొంటున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందినే అనే నమ్మం ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. కానీ, ట్రైలర్ డోస్ ఏ మాత్రం సరిపోదనిపిస్తోంది. నిజానికి కాస్త పెద్ద సినిమా అంటే ప్రీ బుక్సింగ్ బాగా జరిగిపోతాయి. ఫలితం సంగతి పక్కన పెట్టినా, మొదటి రెండు రోజులు టికెట్స్ దొరకడం కష్టంగా ఉంటుంది.
కానీ, చైతూ కస్టడీ మూవీ విషయంలో అవేమీ జరగడం లేదు. ప్రీ బుక్సింగ్స్ అనుకున్నంతగా ఏమీ అవ్వడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. వీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా, ట్రైలర్ ముందే రిలీజ్ చేసినా ఇప్పటి వరకు అయితే, ఇవేమీ మూవీకి అనుకూలంగా మారలేదనే టాక్ ఎక్కువగా వినపడుతోంది.
మూవీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించాలి అంటే కచ్చితంగా ఫస్ట్ షో పాజిటివ్ టాక్ రావాల్సిందే. ఫస్ట్ షోలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ప్రేక్షకులు క్యూ కట్టేస్తారు. సాయిధరమ్ తేజ్ విరూపాక్ష విషయంలోనూ ఇదే జరిగింది.
మొదట ప్రీ బుకింగ్స్ ఏమీ జరగలేదు. మూవీ పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాతే, జనాలు క్యూలు కట్టారు. ఇక చైతూ మూవీ విషయంలోనూ అదే జరగాలి. మరో ఆప్షన్ లేదు. టాక్ కాస్త అటూ, ఇటూ కొట్టినా, చైతూ కష్టం మొత్తం వృథా అయిపోయినట్లే. అలాకాకుండా.. మూవీలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నా కూడా సినిమా పక్కా హిట్ కొట్టేస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా, ఈ కస్టడీ చిత్రానికి తమిళ డైరెక్టర్ వెంటక్ ప్రభు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో కృతి శెట్టి , చైతూకి జోడిగా కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి గతంలో సోగ్గాడే చిన్ని నాయన లో నటించారు. ఆ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా కూడా హిట్ అయితే, వీరి ఇద్దరి పెయిర్ కూడా హిట్ అవుతుంది. కాగా, ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు. ఆయన తొలిసారి మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఆయన పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు.